వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియాకు వెస్టిండీస్ షాకిచ్చింది. తిరువనంతపురంలో జరిగిన రెండో టీ20లో విండీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని 15 బంతులు మిగిలుండగానే పూర్తి చేశారు కరీబియన్ బ్యాట్స్‌మెన్. ఓపెనర్ లెండిల్ సిమ్మన్స్(67) అర్ధశతకంతో రాణించగా.. మిగతా బ్యాట్స్‌మెన్ తలో చేయి వేసి జట్టుకు విజయాన్నందించారు. భారత బౌలర్లలో జడేజా, సుందర్ చెరో వికెట్ తీసుకున్నారు.
లక్ష్య ఛేదనలో విండీస్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు సిమ్మన్స్, లూయిస్(40) తొలి వికెట్‌కు 73 పరుగులు జోడించారు. లూయిస్‌ను వాషింగ్టన్ సుందర్ ఔట్ చేయగా.. అనంతరం క్రీజులోకి వచ్చిన హిట్మైర్(23) బౌలర్లపై ప్రతి దాడికి దిగాడు. జడ్డూ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టి భారత అభిమానుల గుండెల్లో గుబులు పుట్టించాడు.
కోహ్లీ కిర్రాక్ క్యాచ్..