భారత వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్.. కాంకషన్ (తల అదరడం)కు గురయ్యాడు. మంగళవారం ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో ఈ సంఘటన జరిగింది. టీమిండియా ఇన్నింగ్స్ 44వ ఓవర్లో కమిన్స్ వేసిన షార్ట్ పిచ్ డెలివరీని... పంత్ పుల్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో మొదట బ్యాట్‌కు తగిలిన బంతి.. ఆ తర్వాత హెల్మెట్‌ను తాకింది. అప్పట్నుంచి వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్న పంత్.. రాజ్‌కోట్‌లో జరిగే రెండో వన్డేకు దూరమయ్యాడు.
ఆసీస్‌తో రెండో వన్డేకు రిషబ్ పంత్ దూరం - rishabh pant injury
టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆస్ట్రేలియాతో జరిగే రెండో వన్డేకు దూరమయ్యాడు. మొదటి వన్డేలో కాంకషన్‌కు గురైన పంత్ కోలుకోవడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది.
పంత్
ఆసీస్‌తో మొదటి మ్యాచ్‌లో.. రిషభ్ పంత్ స్థానంలో కేఎల్ రాహుల్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. పంత్ కోలుకోవడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. రెండో వన్డేలో రాహుల్ కీపింగ్ చేస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ రాహుల్ వికెట్ల వెనక బాధ్యతలు నిర్వర్తిస్తే మనీశ్ పాండే తుది జట్టులోకి వచ్చే అవకాశముంది.
ఇవీ చూడండి.. వైరల్: విరాట్ కోహ్లీ.. అతడి 'తల'కెక్కాడు!