తెలంగాణ

telangana

ETV Bharat / sports

'గంగూలీ స్కూల్​కు చెందినవాడు కోహ్లీ.. అందుకే అలా' - విరాట్ ​కోహ్లీ న్యూస్​

ఓ పర్యటనలో విఫలమైనంత మాత్రాన కోహ్లీ, తీరు మార్చుకోవాల్సిన అవసరం లేదని అన్నాడు భారత క్రికెట్ సలహా మండలి(సీఏసీ) సభ్యుడు మదన్​లాల్. అలాగే ధోనీ ఎంపిక గురించి సెలక్టర్లు చూసుకుంటారని చెప్పాడు.

'గంగూలీ స్కూల్​కు చెందినవాడు కోహ్లీ.. అందుకే అలా'
కోహ్లీ మదన్​లాల్

By

Published : Mar 17, 2020, 2:16 PM IST

Updated : Mar 17, 2020, 2:30 PM IST

ఇటీవలే జరిగిన న్యూజిలాండ్​ పర్యటనలో టీ20ల్లో గెలిచిన భారత్.. వన్డే, టెస్టు సిరీస్​ల్లో ఓడింది. కెప్టెన్ కోహ్లీ ఘోరంగా విఫలమయ్యాడు. కేవలం ఒక్క అర్ధశతకం మాత్రమే చేశాడు. దీంతో పలువురు విశ్లేషకులు కోహ్లీని విమర్శించారు. అతడు మైదానంలో వ్యవహరించే తీరు మార్చుకోవాలని సూచించారు. క్రికెట్ సలహా మండలి (సీఏసీ) సభ్యుడు మదన్​లాల్ మాత్రం దీనిపై అడ్డుచెప్పాడు. కోహ్లీ తీరు మారాల్సిన అవసరం లేదని అన్నాడు.

"కెప్టెన్ అంటే దూకుడుగా ఉండాలని మీరే అంటారు. అలా చేస్తే విమర్శిస్తారు. మైదానంలో కోహ్లీ తీరు నాకు నచ్చుతుంది. అతడు గంగూలీ స్కూల్​కు చెందినవాడు. వారికి స్వదేశం, విదేశం అనే తేడా ఉండదు. ఎప్పుడు ఒకేలా ఆడతారు. ఉత్తమ బ్యాట్స్​మన్ కొన్నిసార్లు ఫామ్​ కోల్పోతారు. అంతమాత్రాన వారికి తక్కువ చేయడం సరికాదు. కోహ్లీనే చూసుకుంటే ఇటీవల కాలంలో విఫలమైనా సరే నం.1 ర్యాంక్​లో కొనసాగుతున్నాడు"

-మదన్​లాల్, సీఏసీ సభ్యుడు

ధోని భవిష్యత్ గురించి ప్రశ్నించగా.. జట్టులో అతడిని ఎంపిక చేసే విషయం సెలెక్టర్లు చూసుకుంటారని మదన్​లాల్ అన్నాడు. తనకు దాని గురించి తెలియదని చెప్పాడు​.

ఇదీ చూడండి.. ఝార్ఖండ్​ వీధుల్లో ధోనీ రయ్ రయ్

Last Updated : Mar 17, 2020, 2:30 PM IST

ABOUT THE AUTHOR

...view details