తెలంగాణ

telangana

ETV Bharat / sports

నాలుగో స్థానం బ్యాటింగ్​లో అతడే బాస్! - నాలుగో స్థానం

గత కొంతకాలంగా కివీస్​ తరఫున నాలుగో స్థానంలో రాణిస్తున్నాడు రాస్ టేలర్. ఇదే స్థానంలో వచ్చి, భారత్​తో జరిగిన తొలి వన్డేలో శతకంతో ఆకట్టుకున్నాడు. ఛేదనలోనూ తనకు తిరుగులేదని నిరూపించాడు.

నాలుగో స్థానం బ్యాటింగ్​లో అతడే బాస్!
రాస్ టేలర్

By

Published : Feb 6, 2020, 5:57 AM IST

Updated : Feb 29, 2020, 8:52 AM IST

హామిల్టన్​ వేదికగా జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ అద్భుత విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 348 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 4 వికెట్ల తేడాతో గెలిచింది. సీనియర్ బ్యాట్స్​మన్ రాస్​ టేలర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కెరీర్​లో 21వ శతకం నమోదు చేసి, తమ జట్టును 1-0 ఆధిక్యంలోకి వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే నాలుగో స్థానంలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్​మన్​గా నిలిచాడు. ​

నాలుగులో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్​మెన్

  • రాస్ టేలర్-19
  • ఏబీ డివిలియర్స్-15
  • అరవింద డిసిల్వా-10
  • మహేలా జయవర్దనే-9
    రాస్ టేలర్

టేలర్.. కివీస్​ తరఫున వన్డేల్లో నాలుగు అత్యుత్తమ ఛేదనల్లో మూడుసార్లు భాగమయ్యాడు. అందులో మూడుసార్లు ఇతడు శతకాలు చేయడం విశేషం. 2014 నుంచి నాలుగు అంతకంటే దిగువ స్థానాల్లో వచ్చి, ఏకంగా ఐదుసార్లు ఛేదనలో సెంచరీలు చేశాడు. అందుకే న్యూజిలాండ్​ తరఫున అత్యుత్తమ బ్యాట్స్​మన్​గా నిలిచాడు. ఈ కాలవ్యవధిలో కివీస్​కు చెందిన మరే ఇతర క్రికెటర్ కూడా కనీసం రెండు శతకాలైనా చేయకపోవడం టేలర్ సత్తా ఏంటో చెబుతోంది.

కివీస్ తరఫున రాస్ టేలర్ అత్యుత్తమ ఛేదనలు

వన్డేల్లో న్యూజిలాండ్ అత్యుత్తమ ఛేదనలు

  • 348 vs టీమిండియా, హామిల్టన్, 2020*, టేలర్ 109*
  • 347 vs ఆస్ట్రేలియా, హామిల్టన్,2007, టేలర్ 11
  • 337 vs ఆస్ట్రేలియా, ఆక్లాండ్, 2007, టేలర్ 117
  • 336 vs ఇంగ్లాండ్, డూన్​డిన్, 2018, టేలర్ 181*

గత మూడేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాట్స్​మెన్ సరాసరి తీసుకుంటే, అందులో రెండో స్థానంలో నిలిచాడు రాస్ టేలర్. ఇతడి కంటే ముందు కోహ్లీ ఉన్నాడు. 2017-20 మధ్య కాలంలో 50 ఇన్నింగ్స్​ల్లో టేలర్.. 67.76 సరాసరితో ఉండగా, కోహ్లీ.. 66 ఇన్నింగ్స్​ల్లో 78.61 సరాసరితో ఉన్నాడు. టేలర్ సరాసరి హిట్​మ్యాన్​ రోహిత్ శర్మ(70 ఇన్నింగ్స్​ల్లో 65.31) కంటే అధికం.

2017-20 మధ్య వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో నాలుగో స్థానంలో ఉన్నాడు టేలర్(2643 పరుగులు). ఈ జాబితాలో కోహ్లీ 4088 పరుగులతో అగ్రస్థానంలో, రోహిత్ శర్మ 3984 పరుగులతో రెండో స్థానంలో ఉన్నారు.

Last Updated : Feb 29, 2020, 8:52 AM IST

ABOUT THE AUTHOR

...view details