తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత మాజీలతో ప్రస్తుత జట్టుకు మ్యాచ్​ పెడితే?

గత కొన్నేళ్లలో రిటైర్ అయిన భారత క్రికెటర్లను ఓ జట్టుగా చేసి, వారిని ప్రస్తుత జట్టుతో తలపడేలా ఓ వీడ్కోలు మ్యాచ్​ జరిపితే బాగుంటుందని మాజీ ఆల్​రౌండర్​ ఇర్ఫాన్​ పఠాన్​ ట్వీట్ చేశాడు. ధోనీ, రైనా తమ కెరీర్​కు ముగింపు పలికిన సందర్భంగా ఈ విషయాన్ని పంచుకున్నాడు.

Pathan
ఇర్ఫాన్​ పఠాన్​

By

Published : Aug 22, 2020, 9:04 PM IST

గత కొన్నేళ్లలో అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించిన భారత మాజీ క్రికెటర్లందరికీ వీడ్కోలు మ్యాచ్ ఒకటి​ నిర్వహించాలని మాజీ ఆల్​రౌండర్​ ఇర్ఫాన్​ పఠాన్​ అభిప్రాయపడ్డాడు. ఆగస్టు 15న టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీ, బ్యాట్స్​మన్​ సురేశ్​ రైనా.. తమ అంతర్జాతీయ కెరీర్​కు ముగింపు పలికారు. ఈ క్రమంలోనే వారికి వీడ్కోలు మ్యాచ్​తో గౌరవించాలని అనేకమంది క్రికెటర్లు, అభిమానుల నుంచి డిమాండ్లు వినిపించాయి. ఈ క్రమంలో పఠాన్​ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి సంతరించుకున్నాయి.

"రిటైర్మెంట్​ ప్రకటించిన ఆటగాళ్లందరికీ వీడ్కోలు మ్యాచ్​ నిర్వహించడం గురించి అందరూ మాట్లాడుతున్నారు. ప్రస్తుత ఆటగాళ్లకు వ్యతిరేకంగా మాజీ క్రికెటర్లతో ఓ టీమ్​​ ఏర్పాటు చేసి ఎందుకు చారిటీ మ్యాచ్​ నిర్వహించకూడదు?"

ఇర్ఫాన్ పఠాన్​, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

ఈ ఏడాది ప్రారంభంలో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్​ ప్రకటించిన పఠాన్​.. మాజీ ఆటగాళ్లతో కూడిన జాబితాను ట్విట్టర్​ వేదికగా పంచుకున్నాడు. ఇందులో ధోనీ, రైనా, సెహ్వాగ్​, గౌతమ్​ గంభీర్​, వీవీఎస్​ లక్ష్మణ్​, రాహుల్​ ద్రవిడ్​లతో పాటు అజిత్​ అగార్కర్​, ప్రజ్ఞాన్​ ఓజా, యువరాజ్​ సింగ్​, జహీర్​ ఖాన్​లతో వీడ్కోలు గేమ్​ నిర్వహించాలని సూచించాడు. అయితే, ప్రస్తుత కరోనా పరిస్థితుల మధ్య.. బీసీసీఐ ఎగ్జిబిషన్​ మ్యాచ్​ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details