టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఆగస్టు 15న 19:29గం. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఇన్స్టా ద్వారా తన క్రీడా ప్రస్థానాన్ని ఉద్దేశిస్తూ ఓ భావోద్వేగ వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో క్రికెట్ అభిమానుల మదిలో ఓ సందేహం మెదులుతోంది. పంద్రాగస్టు రోజునే సరిగ్గా 19:29గం. సమయాన్నే ఎందుకు ఎంచుకున్నాడు. దీనికి ఏమైనా ప్రత్యేకత ఉందా? అనే దిశగా క్రీడాభిమానులు, విశ్లేషకులు ఆలోచిస్తున్నారు. కొంతమంది ఈ వియయమై తీవ్రంగా చర్చిస్తూ.. తమకు తెలిసింది నెట్టింట్లో పోస్ట్ చేశారు. అదేంటో తెలుసుకుందాం.
ధోనీ, రైనా జెర్సీ నెంబర్స్
ధోనీతో పాటు ఆల్రౌండర్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. వీరిద్దరికి ఆటలో చక్కని భాగస్వామ్యం ఉంది. వీరి జెర్సీలు నెం.7, నెం.3. ఈ రెండు కలిపితే 73.. అయితే సరిగ్గా స్వాతంత్య్రం వచ్చి 73 సంవత్సరాలు అయింది. ఇందుకే వీరిద్దరు కలిసి పంద్రాగస్టున వీడ్కోలు పలికారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
గతేడాది ప్రపంచకప్ ఓటమి
ధోనీ చివరిసారిగా 2019లో న్యూజిలాండ్తో జరిగిన ప్రపంచకప్లో ఆడాడు. ఈ టోర్నీ సెమీఫైనల్లో టీమ్ఇండియా సరిగ్గా 19.29గంటలకు ఓటమిపాలైంది. అందుకే అదే సమయానికి ధోనీ రిటైర్మెంట్ ప్రకటించాడని మరికొందరి అభిప్రాయం.