తెలంగాణ

telangana

ETV Bharat / sports

గూగుల్ మరో తప్పిదం.. ఈసారి సచిన్ కుమార్తెకు పెళ్లి! - కోహ్లీ అనుష్క శర్మ రషీద్ ఖాన్

వరుస తప్పిదాలు చేస్తున్న గూగుల్.. దిగ్గజ సచిన్ కుమార్తెను భారత యువ క్రికెటర్ భార్యగా చూపిస్తోంది.​ ఇంతకీ ఆ ఆటగాడు ఎవరంటే?

Why Is Sara Tendulkar Named As 'Shubman Gill's Wife' On Google Search?
గూగుల్ మరో తప్పిదం.. ఈసారి సచిన్ కుమార్తెకు పెళ్లి!

By

Published : Oct 15, 2020, 1:52 PM IST

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ మరో తప్పిదం చేసింది. దిగ్గజ సచిన్ తెందుల్కర్ కుమార్తె సారాను యువ క్రికెటర్ శుభ్​మన్ గిల్ భార్య అని చూపిస్తోంది. ఈ విషయమై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.

కారణం ఏంటి?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్న శుభ్​మన్, సారా.. ఒకరి పోస్టులకు మరొకరు కామెంట్లు పెడుతున్నారు. దీంతో పలు వెబ్​సైట్లు వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని వార్తలు రాశాయి. దాంతో సెర్చ్ ఇంజిన్ వీళ్లిద్దరిని భార్య, భర్తలు అని చూపిస్తోంది.

గూగుల్​కు ఇదేం కొత్త కాదు

కొన్నిరోజుల క్రితం ఇదే తరహాలో క్రికెటర్ రషీద్ ఖాన్ భార్య నటి అనుష్క శర్మ అని గూగుల్ చూపించింది. రషీద్, తన అభిమాన నటి అనుష్క అని గతంలో చెప్పడం వల్ల వాటి గురించి వార్తలు రాశారు. దీంతో వీరిద్దరూ భార్య భర్తలు అని సెర్చ్ ఇంజిన్ చూపించడం మొదలుపెట్టింది. అయితే గూగుల్​లో ఇటీవల మారిన అల్గారిథమ్స్ ఈ తప్పిదాలకు కారణమని తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details