తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీకి 'చీకూ' అనే ముద్దుపేరు ఎలా వచ్చిందంటే? - క్రికెట్ వార్తలు

తన ముద్దు పేరు వెనకున్న రహస్యాన్ని కోహ్లీ వెల్లడించాడు. ధోనీ వల్లే ఇది అందరికీ తెలిసిందని చెప్పాడు. అందుకు సంబంధించిన పూర్తి వివరాల్ని పంచుకున్నాడు.

కోహ్లీకి 'చీకూ' అనే ముద్దుపేరు ఎలా వచ్చిందంటే?
విరాట్ కోహ్లీ

By

Published : Apr 4, 2020, 5:31 AM IST

టీమిండియా కెప్టెన్ కోహ్లీ ముద్దుపేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తనను 'చీకూ' అని ఎందుకు పిలుస్తారు? మొదటగా ఎవరు అలా అన్నారు? తదితర విషయాల్ని ఇంగ్లాండ్ క్రికెటర్ పీటర్సన్​తో జరిగిన వీడియో చాట్​లో చెప్పాడు.

తను 'చీకూ' అనే పేరుతో పాపులర్​ కావడానికి కారణం మాజీ కెప్టెన్ ధోనీ అని చెప్పాడు కోహ్లీ. వికెట్ల వెనక నుంచి తరుచుగా అలా పిలవడం, మైక్​లో రికార్డవడం వల్ల అందరికీ తెలిసిందని అన్నాడు. అయితే ఈ పేరు పెట్టింది తన కోచ్​ అని తెలిపాడు.

చిన్నప్పటి కోహ్లీ ఫొటో

'రంజీ ట్రోఫీ ఆడుతున్న సమయంలో నాకు బుగ్గలు బాగా ఉండేవి. అప్పట్లో కొత్త హెయిర్​ స్టైల్ కోసం ప్రయత్నించడం వల్ల చెవులు, చెంపలు మాత్రమే కనిపించేవి. దీంతో కార్టూన్ పాత్ర చీకూ పేరును కోచ్ నాకు పెట్టేశారు. అప్పటి నుంచి అంతా అలా పిలవడం మొదలుపెట్టారు' -కోహ్లీ, టీమిండియా కెప్టెన్

ABOUT THE AUTHOR

...view details