తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ధోనీ అందుకే సామాజిక మాధ్యమాల్లోకి రావట్లేదు' - ధోనీ సోషల్ మీడియా ఎందుకు వాడట్లేదు

స్టార్ క్రికెటర్​ ధోనీకి సంబంధించిన ఫొటోలు, వీడియోల్ని ఎప్పటికప్పుడూ అతడి సతీమణి సాక్షి, అభిమానులతో పంచుకుంటోంది. అయితే సోషల్ మీడియాలోకి మహీ ఎందుకు రావట్లేదు? దూరంగా ఉండటానికి గల కారణాన్ని ఈమె తాజాగా వెల్లడించింది.

ధోనీ
ధోనీ

By

Published : Jun 5, 2020, 5:19 PM IST

Updated : Jun 5, 2020, 5:31 PM IST

లాక్​డౌన్​తో టీమ్​ఇండియా క్రికెటర్లందరూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. మాజీ సారథి ధోనీ మాత్రం వాటికి దూరంగా ఉన్నాడు. మహీకి సంబంధించిన ఫొటోలు, వీడియోల్ని అతడి భార్య సాక్షి సింగ్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తోంది. ఇటీవలే చెన్నై సూపర్​కింగ్స్​తో జరిగిన లైవ్​చాట్​లో మాట్లాడిన సాక్షి.. సామాజిక మాధ్యమాల్లోకి ధోనీ రాకపోవడానికి గల కారణాన్ని వెల్లడించింది.

"ధోనీ గురించి మీ అందరికీ తెలుసు ఎప్పుడూ ఇన్​స్టా లైవ్​లోకి వచ్చి మాట్లాడడు. కరోనా గురించి ఏదైనా విషయం షేర్ చేయాలన్నా ఒత్తిడికి గురవుతాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఈ మహమ్మారి నివారణ గురించి ఏదో ఓ విషయాన్ని చెబుతారు. ప్రజలందరూ దానిని పాటిస్తారు. ప్రస్తుత సమయంలో ప్రధాని కంటే ఎవరూ ఎక్కువ కాదు. అందుకే మహీ సోషల్ మీడియాలోకి రావట్లేదు"

-సాక్షి సింగ్, ధోనీ భార్య

గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్​ తర్వాత నుంచి క్రికెట్​కు దూరంగా ఉంటున్నాడు ధోనీ. ఈ ఏడాది ఐపీఎల్​లో సత్తాచాటి తిరిగి జట్టులో చోటు దక్కించుకోవాలని అనుకున్నాడు. కానీ కరోనా కారణంగా లీగ్ నిరవధిక వాయిదా పడింది. అయితే ఐపీఎల్ కోసం మహీ విభిన్నంగా సాధన చేశాడని, అందరూ కొత్త ధోనీని చూస్తారని సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనా, ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

ఇది చదవండి:

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న భారత క్రికెటర్!

Last Updated : Jun 5, 2020, 5:31 PM IST

ABOUT THE AUTHOR

...view details