తెలంగాణ

telangana

ETV Bharat / sports

సూపర్‌ ఓవర్‌లో షమిని కాదని బుమ్రాకే ఎందుకు?

న్యూజిలాండ్​తో మూడో టీ20లో భారత్​ సూపర్​ ఓవర్​లో అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో రోహిత్​ శర్మ తనదైన రీతిలో రెండు సిక్సర్లు బాది జట్టును గెలిపించాడు. అంతకుముందు న్యూజిలాండ్​ ఇన్నింగ్స్​లో ఆఖరి ఓవర్​ అద్భుతంగా వేసిన షమిని కాదని.. సూపర్​ ఓవర్​లో బుమ్రాకు బంతి ఇచ్చాడు సారథి కోహ్లీ. తాజాగా దీనికి కారణం వెల్లడించాడు రోహిత్​.

Why didn't Virat kohli use Shami to bowl Super over even He was good in final Over? Answered by Rohit Sharma
సూపర్‌ ఓవర్‌లో షమి బదులు బుమ్రాకే బౌలింగ్​ ఎందుకంటే..?

By

Published : Jan 31, 2020, 7:31 AM IST

Updated : Feb 28, 2020, 3:00 PM IST

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించింది టీమిండియా. రోహిత్‌ తొలుత అర్ధశతకం, ఆ తర్వాత సూపర్​ ఓవర్​లో రెండు సిక్సర్లు బాది అద్భుత ప్రదర్శన చేశాడు. ఫలితంగా న్యూజిలాండ్‌ గడ్డపై తొలి టీ20 సిరీస్‌ విజయం అందుకుంది కోహ్లీసేన.

ప్రణాళికలకు సమయమేది?

ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లలో బుమ్రా 4 ఓవర్లు వేసి అత్యధిక పరుగులు (45) ఇవ్వగా.. అతడితోనే సూపర్‌ ఓవర్‌ వేయించాడు కోహ్లీ. ఆ ఓవర్‌లోనూ బుమ్రా 17 పరుగులిచ్చాడు. ఈ విషయంపై రోహిత్‌ మీడియాతో మాట్లాడాడు. మ్యాచ్‌ టైగా మారి సూపర్‌ ఓవర్‌కు దారితీస్తే.. ఆ సమయంలో ఎలాంటి ప్రణాళికలు వేసుకునే అవకాశం ఉండదని చెప్పాడు. ఆ రోజు ఆటలో ఏం జరిగిందో దాన్నే దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని, అందులో ఎవరు బాగా ఆడితే వారినే పంపిస్తారని స్పష్టం చేశాడు.

" టీమిండియాలో బుమ్రా కీలకమైన పేసర్. సూపర్​ ఓవర్​ సమయంలో మాకు వేరే అవకాశం లేదు. ఒక సందర్భంలో షమి, జడేజాలలో ఎవరిచేత అయినా వేయించాలనే సందిగ్ధత నెలకొంది. కానీ చివరికి కచ్చితమైన యార్కర్లు, స్లో బంతులేసే బుమ్రా చేతే వేయించాలని నిర్ణయించాం".

--రోహిత్​శర్మ, భారత జట్టు ఓపెనర్​

బ్యాటింగ్‌ విషయంలోనూ ఆ రోజు ఎవరు బాగా ఆడితే వారే బరిలోకి దిగుతారని చెప్పాడు హిట్​మ్యాన్​. ఒకవేళ తాను ఈ మ్యాచ్‌లో 65 పరుగులు చేయకుంటే.. సూపర్‌ఓవర్‌లో బ్యాటింగ్‌ చేసేవాడిని కాదని, తన బదులు శ్రేయస్‌ అయ్యర్‌ లేదా వేరే బ్యాట్స్‌మన్‌ దిగేవారని అన్నాడు రోహిత్‌. భారత జట్టు ఇప్పటికే 3-0తో సిరీస్‌ కైవసం చేసుకోగా.. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో రిజర్వ్‌ బెంచ్‌ ఆటగాళ్లకి అవకాశం ఇస్తామని కోహ్లీ తెలిపాడు. శుక్రవారం నాలుగో టీ20 జరగనుండగా.. ఆదివారం ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహించనున్నారు.

Last Updated : Feb 28, 2020, 3:00 PM IST

ABOUT THE AUTHOR

...view details