తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఖరీదైన కారు వాడుతున్న భారత క్రికెటర్​ ఎవరంటే..? - విరాట్​ కోహ్లీ కారు

క్రికెట్.. ఇది భారత్​లో ఆట మాత్రమే కాదు ఓ ఎమోషన్​. అందుకే భారీ స్థాయిలో అభిమానుల ఆదరణ దీని సొంతం. ఇక భారతీయ క్రికెటర్ల గురించి చెప్పక్కర్లేదు. వారి గురించి ఏదొక విషయం తెలుసుకునే పనిలోనే ఉంటారు అభిమానులు. వారు ఎలా ఉంటారు? ఏం తింటారు? ఎలా శారీరక దృఢత్వాన్ని కాపాడుకుంటారు? వ్యక్తిగత జీవితం ఏంటి? వంటి ఎన్నో విషయాలపై ఫ్యాన్స్​కు ఎప్పుడూ ఆసక్తే. అయితే ఆటగాళ్లు కూడా బ్యాట్​, బంతి గురించే కాకుండా వ్యక్తిగత అభిరుచులనూ షేర్​ చేసుకుంటారు. అయితే ముఖ్యంగా ఆటగాళ్లలో చాలా మందికి కార్లపై అమితాసక్తి ఉంది. అందుకే భారీగా వెచ్చించి లగ్జరీ కార్లు కొనేశారు. టాప్​-8 క్రికెటర్ల కార్లు, వాటి ధరలు ఇవే..

cars of indian cricketers in telugu
ఖరీదైన కారు వాడుతున్న భారత క్రికెటర్​ ఎవరంటే..?

By

Published : Jul 6, 2020, 12:34 PM IST

8. ఎంఎస్​ ధోనీ

టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్​ ధోనీకి బైక్​లు అంటే మక్కువ. గ్యారేజ్​లో ఎన్నో బైక్​లు ఉంటాయి. అయితే కార్లు కూడా అంతేస్థాయిలో ఉంటాయట. ఆడి క్యూ7, మిస్తుబిషి పాజెరో ఎస్​ఎఫ్​ఎక్స్​, ల్యాండ్​ రోవర్​ ఫ్రీలాండర్​ 2, ఫెరారీ 599 జీటీఓ, గ్రాండ్​ చెరోకీ, ట్రాక్​హ్యాక్ జీప్​లు మహీ దగ్గర ఉన్నాయి. ఇండియన్​ ఆర్మీ కోసం తయారు చేసే నిస్సాన్​ జోంగా జీప్ కూడా ధోనీ ఇంట్లో ఉంది. రూ.75 లక్షల విలువైన హమ్మర్​ హెచ్​2 అతడికి బాగా ఇష్టమైన వాహనం. 6.2 లీటర్ల పెట్రోల్​ వీ8 ఇంజిన్​ ఈ కారు ఫీచర్​. ఇవే కాకుండా మహీంద్ర స్వరాజ్​ 963 ఎఫ్​ఈ ట్రాక్టర్​ కూడా ఇటీవలే ధోనీ గ్యారేజ్​కు చేరింది.

ధోనీ

7. కేఎల్​ రాహుల్​

భారత క్రికెట్​ జట్టులో టాప్​క్లాస్​ బ్యాట్స్​మన్​గా ఉన్న కేఎల్​ రాహుల్​.. స్టైల్​గా ఉండటమే కాకుండా మైదానంలోనూ అంతే స్టైల్​గా షాట్లు కొడతాడు. అందుకే యూత్​ ఐకాన్​ అయ్యాడు. ఇతడు ఇంటిలోంచి బయటకు వస్తే మెర్సిడెస్​ సీ43 ఏఎమ్​జీ వాడతాడు. ఇది ఈ క్రికెటర్​ మొదటి కారు. 3 లీటర్లు పట్టే వీ6 ఇంజిన్​ దీని సొంతం. ధర రూ.75 లక్షలు.

కేఎల్​ రాహుల్​

6.శిఖర్​ ధావన్​

భారత జట్టులో గబ్బర్​గా పేరున్న శిఖర్​ ధావన్​కు కార్లంటే అమితమైన ఇష్టం. ఇతడు మెర్సిడెస్​ జీఎల్​ 350 సీడీఐ కారు సొంతం చేసుకున్నాడు. ఈ లగ్జరీ కారుకు వీ6, 3 లీటర్ల టర్బో ఛార్జ్​డ్​ డీజిల్​ ఇంజిన్​ ఉంది. అంతేకాకుండా 7జీ ట్రోనిక్​ ఆటోమేటిక్​ ట్రాన్స్​మిషన్​ గేర్​బాక్స్​ కూడా ఉంటుంది. ఇది 220 కిమీ/గంటకు గరిష్ఠ వేగం అందుకోగలదు. దీని ధర రూ.80 లక్షలు. ఇతడి గ్యారేజ్​లో ఆడి క్యూ7 కారు కూడా ఉంది.

శిఖర్​ ధావన్​

5.రోహిత్​శర్మ

భారత క్రికెట్​లో హిట్​మ్యాన్​గా పేరు తెచ్చుకున్నాడు రోహిత్ శర్మ​. ఆటలో విశేషంగా రాణిస్తున్న ఇతడిని.. ఈ ఏడాది ఖేల్​ రత్న అవార్డుకు నామినేట్​ చేసింది బీసీసీఐ. ఇక కార్ల కలెక్షన్​ గురించి చూసుకుంటే రూ. 1.55 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ ఎం5 కారు ఇతడి సొంతం. 4.4 లీటర్ల టర్బో ఛార్జ్​ ఉన్న వీ8 పెట్రోల్​ ఇంజిన్​, 560 బీహెచ్​పీ, 680ఎన్​ఎం టార్క్​ దీని ఫీచర్లు. ఈ కారు 7 స్పీడ్​ ఆటోమేటిక్​ ఎమ్​ డబుల్​ క్లట్జ్​ ట్రాన్సిమిషన్​ గేర్​బాక్స్​ కలిగి ఉంది. దీనితో పాటు బీఎండబ్ల్యూ ఎక్స్​3, టయోటా ఫార్చునర్​, స్కోడా లౌరా కార్లు రోహిత్​ వద్ద ఉన్నాయి.

రోహిత్​

4. యువరాజ్​ సింగ్​

భారీ షాట్లకు పెట్టింది పేరైన యువరాజ్ తన కార్లకూ అంతే భారీ ధర ఉండేలా చూసుకున్నాడు. ఇతడి వద్ద బీఎండబ్ల్యూ ఎక్స్​ 6ఎమ్​, బీఎండబ్ల్యూ ఎమ్3 కన్వర్టబుల్​​, బీఎండబ్ల్యూ ఎమ్5 ఈ60, ఆడి క్యూ5, బెంట్లే ఫ్లయింగ్​ స్పర్​, లాంబోర్గినీ ముర్కిల్​లాగో కూడా ఉంది. వీటన్నింటిలో లాంబోర్గినీ యువీకి చాలా ఇష్టం. అందుకే దీనితో చాలా సార్లు బుద్ధా ఇంటర్నేషనల్​ సర్క్యూట్​లో చక్కర్లు కొట్టాడు. 6.5 లీటర్ల వీ12 ఇంజిన్​, 631 బీహెజ్​పీ పవర్​, 660 ఎన్​ఎం దీని సొంతం. 2012లోనే ఈ మోడల్​ను నిలిపేశారు. ధర రూ.2.6 కోట్లు.

యువరాజ్​

3.సచిన్​ తెందూల్కర్​

గాడ్​ ఆఫ్​ క్రికెట్​, భారత దిగ్గజం సచిన్​ తెందూల్కర్​ బీఎండబ్ల్యూ ఇండియా సంస్థకు బ్రాండ్​ అంబాసిడర్​గా ఉండేవారు. ఆయన దగ్గర లగ్జరీ మోడల్​ ఐ8 కారు ఉంది. దీని ధర రూ.2.62 కోట్లు. 1.5 లీటర్ల సామర్థ్యమున్న త్రీ సిలిండర్​ పెట్రోల్​ ఇంజిన్​, ఎలక్ట్రిక్​ మోటార్​ ఉన్నాయి. 357 బ్రేక్​ హార్స్​ పవర్, 570 ఎన్​ఎం టార్క్​ ఈ కారు ప్రత్యేకత. దీనితో పాటు ఫెరారీ 360 మోడేనా, బీఎండబ్ల్యూ ఎమ్​ 6 గ్రాన్​ కోప్​, నిస్సాన్​ జీటీ-ఆర్​ కూడా మాస్టర్​ సొంతం.

సచిన్​ తెందుల్కర్​

2. విరాట్​ కోహ్లీ

క్రికెటర్ల ఆదాయ ఆర్జనలో టాప్​లో ఉన్నాడు భారత జట్టు కెప్టెన్​ విరాట్​ కోహ్లీ. ఫోర్బ్స్​లోనూ చోటు దక్కించుకున్న ఈ ఆటగాడి బ్రాండ్​ విలువ దాదాపు రూ.1600 కోట్లు. అమెరికన్​ టూరిస్టర్​, ఫిలిప్స్​ ఇండియా, హీరో మోటో కార్ప్​, ఆడి ఇండియా వంటి ఎన్నో ప్రముఖ సంస్థలకు ఇతడు బ్రాండ్​ అంబాసిడర్​.

విరాట్​ గ్యారేజ్​లో పెద్ద కార్ల కలెక్షనే ఉంది. ఆడి క్యూ8, ఆడి క్యూ7 సహా లిమిటెడ్​ ఎడిషన్​ ఆడి ఆర్​8 వీ10 ఎల్​ఎమ్​ఎక్స్​ కూడా ఉంది. దీని ఖరీదు రూ.3 కోట్లు. 5.7 లీటర్ల వీ10 ఇంజిన్​, 570 బ్రేక్​ హార్స్​పవర్​, టార్క్​ 540 ఎన్​ఎం ఈ కారు ప్రత్యేకతలు. ల్యాండ్​ రోవర్ రేంజ్​ రోవర్​, వోగ్​ ఎస్​ఈ, బెంట్లే ఫ్లయింగ్​ స్పర్​ కూడా ఉన్నాయి.

కోహ్లీ

1. హార్దిక్​ పాండ్యా

స్టైలిష్‌ క్రికెటర్ల జాబితా తీస్తే ముందుండే పేరు హార్దిక్‌ పాండ్యా. ఇప్పుడు తను స్టైలిష్‌ కారు లంబోర్గిని హరకేన్​ ఈవో ఓనర్ కూడా. కెరీర్‌ మొదట్లో పాత కారుకి ఈఎంఐలు కట్టలేక దాన్ని దాచిపెట్టిన పరిస్థితి హార్దిక్‌ది. ఇప్పుడు రూ.3.75 కోట్ల కారుకు అధిపతి. 5.2 లీటర్ల వీ10 ఇంజిన్​ కలిగిన ఈ కారు 2.9 సెకన్లలోనే 0-100 కి.మీ/గంట వేగాన్ని అందుకోగలదు. ఇదే కాకుండా మెర్సిడెస్‌ బెంజ్‌ ఏఎంజీ జీ63 కూడా ఉంది. దీని ధర రూ.2 కోట్లు. బెంజ్‌ కంపెనీ అతికొద్ది ఎస్‌యూవీల్లో ఇదొకటి. సిల్వర్‌ ఫినిష్‌తో చూడగానే ఆకట్టుకుంటుంది. 9స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో పరుగులు తీస్తుంది. హార్దిక్​ వద్ద ల్యాండ్​ రోవర్​ రేంజ్​ రోవర్​ కూడా ఉంది.

హార్దిక్​ పాండ్య

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details