ఐపీఎల్ కోసం అన్ని జట్లు యూఏఈకి వెళ్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇప్పటికే అక్కడికి చేరుకోగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బృందం దుబాయ్ విమానమెక్కారు. ఈ ఫొటోను ఆర్సీబీ పోస్ట్ చేసింది. కోహ్లీ ఈ ఫొటోలో కనిపించడం లేదు, ఎక్కడున్నాడంటూ పలువురు నెటిజన్లు అడుగుతున్నారు.
డియర్ ఆర్సీబీ.. కోహ్లీ ఎక్కడ? - ఆర్సీబీ
ఐపీఎల్లో పాల్గొనేందుకు దుబాయ్ బయలుదేరింది బెంగళూరు జట్టు. అయితే విమానంలో కోహ్లీ కనిపించడం లేదని, ఎక్కడున్నాడంటూ నెటిజన్లు ప్రశ్నలు కురిపిస్తున్నారు.
'డియర్ ఆర్సీబీ.. కోహ్లీ ఎక్కడ' అంటూ నెటిజన్ల ఆరా
ఉమేశ్ యాదవ్, యజువేంద్ర చాహల్, పార్థివ్ పటేల్, నవదీప్ సైనీతో పాటు మిగిలిన ఆటగాళ్లు కనిపిస్తున్నారు. మాస్కులు వేసుకోవడం వల్ల ఎవరు ఎవరనేది గుర్తుపట్టడం కష్టంగా మారింది. దీనితో పాటు కోహ్లీ కూడా కనిపించడం లేదని ప్రశ్నిస్తున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ కూడా యూఏఈకి పయనమైంది. పయనానికి సిద్ధమైన ధోనీ, రైనా, జడేజా ఫొటోలను నెట్టింట షేర్ చేసింది సీఎస్క్.