విరాట్ కోహ్లీ.. టీమిండియా సారథిగానే కాక తన అల్లరి చేష్టలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న క్రికెటర్. వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో అద్భుత శతకంతో జట్టును గెలిపించాడు. మ్యాచ్ అనంతరం చాహల్ టీవీలో మాట్లాడిన కోహ్లీ.. తన ఫిట్నెస్, ఆల్‌రౌండ్ ప్రదర్శనకు గల కారణాలు వివరించాడు.
"నా మనస్తత్వం ఎల్లప్పుడూ సరళంగా ఉంటుంది. గెలుపు కోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తా. అలాగే ప్రతి ఆటగాడు విజయం కోసం వంద శాతం కృషి చేయాలి. లేదంటే జట్టుకు న్యాయం చేయలేం. జీవనశైలి, కసరత్తులు, కఠినమైన ఆహార నియమాలు సరైన రీతిలో పాటించడం వల్ల ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలుగుతాను". -విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి
60-65 పరుగుల వద్ద ఉన్నపుడు కాస్త ఒత్తిడికి గురయ్యానని, కానీ ఆ సమయంలో తను స్థిరంగా బ్యాటింగ్ చేయడం జట్టుకు అవసరమని తెలిపాడు కోహ్లీ.
"60-65 పరుగులకు చేరువవుతున్నపుడు ఒత్తిడికి గురయ్యా. కానీ అప్పుడు నేను స్థిరంగా బ్యాటింగ్ చేయడం అవసరం. నిజంగా జట్టు గురించి ఆలోచిస్తే ఒత్తిడి, అలసట అన్ని మర్చిపోతాం" -కోహ్లీ, టీమిండియా సారథి