తెలంగాణ

telangana

ETV Bharat / sports

సీనియర్ల నుంచి చాలా నేర్చుకున్నా: గిల్ - shubhman gill about tests

సీనియర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నానని అంటున్నాడు టీమిండియా యువ క్రికెటర్ శుభ్​మన్ గిల్. బంగ్లాతో జరిగే టెస్టు జట్టులో సభ్యుడిగా ఉన్నాడీ ఆటగాడు.

గిల్

By

Published : Nov 7, 2019, 9:27 AM IST

వెస్టిండీస్​-ఏతో జరిగిన అనధికార టెస్టులో డబుల్ సెంచరీ చేసిన శుభ్​మన్ తద్వారా టీమిండియా జట్టులోకి ఎంపికయ్యాడు. బంగ్లాదేశ్​తో జరిగే టెస్టు సిరీస్​ జట్టులో సభ్యుడు. అయితే సీనియర్లతో డ్రెస్సింగ్ రూమ్​ పంచుకోవడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నానని అంటున్నాడీ యువ క్రికెటర్.

"పెద్ద ఆటగాళ్లతో డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకున్నప్పుడు నేనెంతో నేర్చుకున్నా. మ్యాచ్‌కు ముందు వారెలా సిద్ధమవుతున్నారో తెలుసుకున్నా. బ్యాటింగ్‌కు వెళ్లే ముందు ఎలా దృష్టి పెడుతున్నారు, ఎలా ఆడుతున్నారు, మ్యాచ్‌ పరిస్థితులను బట్టి ఇన్నింగ్స్‌ వేగాన్ని ఎలా మారుస్తున్నారో గమనించా."
-శుభ్​మన్ గిల్, టీమిండియా ఆటగాడు

ప్రపంచకప్‌ ముందు టీమిండియా తరఫున రెండు వన్డేలు ఆడిన గిల్‌ 16 పరుగులే చేశాడు. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు రిజర్వు ఓపెనర్‌గా ఎంపికయ్యాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ జట్టులోనూ అతడి పేరుంది. సఫారీలతో సిరీస్‌ సమయంలో అతడు కోహ్లీ, పుజారా, రహానె వంటి దిగ్గజాలతో కలిసి డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకున్నాడు.

ఇవీ చూడండి.. భారత్-బంగ్లాదేశ్: 'మహా'పోరులో విజయం ఎవరిది?

ABOUT THE AUTHOR

...view details