తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీకి ఈ ఐపీఎల్​ చాలా కీలకం: కపిల్​దేవ్ - CSK DHONI

స్టార్ బ్యాట్స్​మన్ ధోనీ భవిష్యత్తు గురించి మాట్లాడాడు భారత మాజీ క్రికెటర్ కపిల్​దేవ్. అతడు రానున్న ఐపీఎల్​ సీజన్​లో బాగా ఆడాల్సిన అవసరముందని అన్నాడు.

ధోనీకి ఈ ఐపీఎల్​ చాలా కీలకం: కపిల్​దేవ్
మహేంద్ర సింగ్ ధోనీ

By

Published : Feb 3, 2020, 11:45 AM IST

Updated : Feb 28, 2020, 11:52 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్​పై ప్రస్తుతం ఊహాగానాలు విపరీతంగా వస్తున్నాయి. ఈ తరుణంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు భారత మాజీ క్రికెటర్ కపిల్​దేవ్. వచ్చే ఐపీఎల్ సీజన్ అతడికి​ ఎంతో కీలకమని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

"ఎంతో కాలం క్రికెట్‌కు దూరమైతే, తిరిగి పునరాగమనం చేయడం చాలా కష్టం. కానీ ధోనీకి ఐపీఎల్‌ ఉంది. అతడికి ఆ టోర్నీ ఎంతో కీలకం. అయితే టీమిండియా సెలక్టర్లు అత్యుత్తమ జట్టునే ఎంపిక చేయాలి. ధోనీ దేశానికి ఎన్నో సాధించాడు. కానీ 6-7 నెలలు క్రికెట్‌కు దూరమై అందరిలోనూ తన భవితవ్యంపై ఎన్నో సందేహాలు రేకెత్తించాడు. దీనివల్ల అనవసర చర్చలు సాగుతున్నాయి" -కపిల్​దేవ్, భారత మాజీ క్రికెటర్

ఐపీఎల్‌లో బాగా ఆడితే టీ20 ప్రపంచకప్‌ జట్టు ఎంపిక కోసం ధోనీ పోటీలో ఉంటాడని గతంలో టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌లో గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌ తర్వాత ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్‌ ఆడలేదు. సైనిక సేవ పేరుతో తొలుత రెండు నెలలు విరామం తీసుకున్నాడు. ఆ తర్వాత నుంచి జట్టుకు అందుబాటులో లేడు.

చెన్నై సూపర్​ కింగ్స్​ జట్టుతో కెప్టెన్ ధోనీ

అయితే కాలం గడిచే కొద్దీ అతడి భవితవ్యంపై సందేహాలు ఏర్పడ్డాయి. గంగూలీ, రవిశాస్త్రి, ఎమ్మెస్కే ప్రసాద్‌ కొంత స్పష్టత ఇచ్చినా, వీడ్కోలుపై వార్తలు ఆగలేదు. ఇటీవల ధోనీకి బీసీసీఐ కాంట్రాక్ట్‌ నిరాకరించడం వల్ల అతడి కెరీర్‌ ముగిసినట్టే అని ఇంకా జోరుగా ప్రచారం సాగింది. అయితే వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో సత్తా చాటి టీ20 ప్రపంచకప్‌లో ధోనీ ఆడతాడని తన అభిమానులు భావిస్తున్నారు.

Last Updated : Feb 28, 2020, 11:52 PM IST

ABOUT THE AUTHOR

...view details