మాజీ క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ అంటే ప్రశాంతతకు మారు పేరని మనకు తెలుసు. తన అసాధారణమైన ఆటతీరుతో 'ది వాల్' పేరు కూడా తెచ్చుకున్నాడు. అలాంటి ఆటగాడు.. గతంలో ఓసారి ధోనీపై కోప్పడాడని మీకు తెలుసా? కానీ ఆ సంఘటనతోనే మహీలో మార్పు వచ్చిందని టీమ్ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించాడు.
ఇదీ చదవండి:రెండో మ్యాచ్‌కు ముందు ధోనీసేనకు ఎదురుదెబ్బ!
"మహీ అప్పుడప్పుడే భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ టూర్లో ఓ చెత్త షాట్ ఆడి పాయింట్లో క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో ఆగ్రహించిన ద్రవిడ్.. 'నువ్విలా ఆడితే మ్యాచ్‌ను ముగించలేవని' అన్నాడు. దీంతో తదుపరి మ్యాచ్‌లో అనవసరపు షాట్లను ఆడలేదు ధోనీ. హిట్టింగ్ చేయకపోవడానికి గల కారణం అడగ్గా మరోసారి ద్రవిడ్‌తో తిట్లు తినదల్చుకోలేదని మహీ చెప్పాడు" అని సెహ్వాగ్ నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు.
ఇటీవల ఓ క్రెడిట్ కార్డ్ వ్యాపార ప్రకటనలో భాగంగా కోపంతో నటించాడు ది వాల్ ద్రవిడ్. ఈ సందర్భంగా ద్రవిడ్‌కు సంబంధించి గత విషయాలను ఓ క్రీడా ఛానెల్‌తో పంచుకున్నాడు సెహ్వాగ్.
ఇదీ చదవండి:ద్రవిడ్‌కు కోపం.. రోడ్డుపై అరుస్తూ హల్చల్!