టీమిండియాలో ప్రేమ పక్షులు అంటే టక్కున గుర్తొచ్చే పేరు విరాట్-అనుష్క. ఈ జాబితాలోకి ఇప్పుడు కొత్తగా హార్దిక్-నటాషా చేరారు. అయితే వీరిందరి కంటే ముందే ఓ బాస్కెట్బాల్ క్రీడాకారిణిని తొలిచూపులోనే ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు ఇషాంత్ శర్మ. ఈ విషయాన్నే, ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
"2011లో నా స్నేహితుడు బాస్కెట్బాల్ ఈవెంట్ నిర్వహించాడు. నన్ను ముఖ్య అతిథిగా పిలిచాడు. అప్పుడే ప్రతిమను చూశా. ఆ క్షణమే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయా. అప్పటి నుంచి ఆమె ఆడే ప్రతిమ్యాచ్కు తప్పకుండా వెళ్లేవాడిని. నాకు కొంచెం సిగ్గుగా అనిపించేది. కానీ, ఆ సమయంలో కనీసం తనతో మాట్లాడలేకపోయాను. దాదాపు ఏడాది ఇలానే గడిచిపోయింది. అప్పుడు ఆస్ట్రేలియా సిరీస్కు వెళ్లే ముందు ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని తనతో అన్నా. ఆ తర్వాత లవ్ ప్రపోజ్ చేశా"
- ఇషాంత్ శర్మ, టీమిండియా పేసర్