శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్‌ల కోసం ఆడే భారత జట్టును మంగళవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలక్షన్ విధానంపై విరుచుకుపడ్డాడు భారత సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్. 15 మందితో ఉన్న జట్టులో సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేయకపోవడమేంటని ప్రశ్నించాడు.
"సూర్య కుమార్ యాదవ్ ఏం తప్పు చేశాడో నాకు అర్థం కావట్లేదు. టీమిండియా, భారత్-ఏ, భారత్-బి జట్లలో ఎంపిక చేసిన వారిలాగే అతడు పరుగులు చేస్తున్నాడు. ఒక్కో ఆటగాడికి ఒక్కో రీతిలో నిబంధనలు ఎందుకున్నాయో అర్థం కావట్లేదు"
-హర్భజన్ సింగ్, టీమిండియా మాజీ క్రికెటర్
29 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్.. 73 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 43.53 సగటుతో 4,920 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 24 అర్ధశతకాలు ఉన్నాయి. 149 టీ20ల్లో(ఐపీఎల్ సహా) 31.37 సగటుతో 3,012 పరుగులు చేశాడు. ఇటీవలే బరోడాతో జరిగిన రంజీ మ్యాచ్‌లో 102 పరుగులతో ఆకట్టుకున్నాడు. 85 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 1548 పరుగులు చేశాడు సూర్యకుమార్ యాదవ్. ఇందులో 7 అర్ధశతకాలు ఉన్నాయి.
జనవరి 5 నుంచి శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది టీమిండియా. అనంతరం జనవరి 14 నుంచి 19వరకు వన్డే సిరీస్‌లో తలపడనుంది.
ఇదీ చదవండి: జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో మనుకు స్వర్ణాలు