టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య జెర్సీ నంబర్ '228' వెనకున్న రహస్యం ఎవరికైనా తెలుసా? దీన్ని తాజాగా ఓ సంఖ్యాశాస్త్ర నిపుణుడు మోహన్‌దాస్ మేనన్ వివరించాడు. ట్విట్టర్లో ఐసీసీ హార్దిక్ పాండ్య ఫొటోను షేర్ చేస్తూ.. అతడి జెర్సీ నంబర్‌గా 228ను ఎందుకు ఉపయోగించాడని పోస్ట్ చేసింది. దీనికి సమాధానమిస్తూ పలువురు స్పందించారు.
"విజయ్ మర్చంట్ అండర్-16 టోర్నమెంట్లో బరోడా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు హార్దిక్. 2009 డిసెంబరు 9న నాగోథానే రిలియన్స్ క్రికెట్ స్టేడియంలో ముంబయిపై తన అరంగేట్ర మ్యాచ్‌లో 228 పరుగులు సాధించాడు. తన కెరీర్లో ఇప్పటి వరకు అవి అత్యధిక పరుగులే కాకుండా అదే తొలి డబుల్ సెంచరీ. జట్టు స్కోరు 60 పరుగుల వద్ద ఉన్నప్పుడు బరిలో దిగిన హార్దిక్.. 8 గంటలపాటు క్రీజ్‌లో ఉన్నాడు. 391 బంతులను ఎదుర్కొని 228 పరుగులు చేశాడు. ఆ ఇన్నింగ్స్ ఓవర్‌నైట్‌లో అతడ్ని స్టార్‌ను చేసింది" అని మోహన్‌దాస్ మేనన్ వెల్లడించాడు.