తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్ వేలం: పంజాబ్​కు సీమర్ల కొరత..!

ఐపీఎల్​ వేలంలో సీమర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపనుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు. అదేవిధంగా మంచి ఆల్​రౌండర్​ను తీసుకోవాలనుకుంటోంది.

What is the Kings XI Panjab Strategy IPL Auction
కింగ్స్ ఎలెవన్ పంజాబ్

By

Published : Dec 18, 2019, 3:04 PM IST

కింగ్స్ ఎలెవన్ పంజాబ్​ ఆటగాళ్లను పునరుద్ధరించడానికి పర్యాయపదంగా మారిపోయింది. కానీ ఈ ఏడాది కాస్త పర్వాలేదనిపిస్తోంది. హెడ్​ కోచ్​గా మైక్​ హెసన్​ స్థానాన్ని అనిల్ కుంబ్లేతో భర్తీ చేసింది. ఈ సీజన్​లో గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. గురువారం జరగనున్న ఐపీఎల్ వేలంలో సీమర్ల వైపు మొగ్గు చూపనుంది పంజాబ్.

అంటిపెట్టుకున్న ఆటగాళ్లు

కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, నికోలస్ పూరన్, మన్​దీప్ సింగ్, మహ్మద్ షమి, ముజీబుర్ రెహ్మన్, అర్షదీప్ సింగ్, హార్దస్ విజోయిన్, మురుగన్ అశ్విన్, హర్​ప్రీత్ బ్రార్, దర్షన్ నల్కాండే

ట్రేడెడ్ ఇన్: క్రిష్ణప్ప గౌతమ్ (రాజస్థాన్ నుంచి), జగదీశ సుచిత్ (దిల్లీ నుంచి)

వదులుకున్న ఆటగాళ్లు

డేవిడ్ మిల్లర్, ఆండ్రూ టై, సామ్ కరన్, హెన్రిక్స్, ప్రభ్​సిమ్రన్ సింగ్, అగ్నివేశ్ అయాచీ, వరుణ్ చక్రవర్తి

ట్రేడెడ్ ఔట్ : అంకిత్ రాజ్​పుత్ (రాజస్థాన్​కు), రవిచంద్రన్ అశ్విన్ (దిల్లీకు)

అందుబాటులో ఉన్న నగదు: 42.70 కోట్లు

తీసుకునే అవకాశం ఉన్న ఆటగాళ్ల సంఖ్య: 9 (స్వదేశీ 5, విదేశీ 4)

వ్యూహం

2018, 19 సీజన్​లో కెప్టెన్​గా వ్యవహరించిన అశ్విన్​ను దిల్లీకి బదిలీ చేసింది. ప్రస్తుతానికి ఇంకా తొమ్మిది స్థానాలు ఖాళీ ఉన్నాయి. ప్రతి విభాగంలోనూ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఈ జట్టులో సీమర్ల కొరత ఉంది. అందువల్ల విదేశీ, స్వదేశీ బౌలర్లను కొనుగోలు చేసే వీలుంది. బ్యాటింగ్​ లైనప్​ కాస్త బలహీనంగానే కనిపిస్తోంది. క్రిస్ గేల్, నికోలస్ పూరన్​లకు మద్దతుగా నిలిచే బ్యాట్స్​మన్​ను తీసుకోవాల్సి ఉంది. అలాగే మంచి ఆల్​రౌండర్​ను వేలంలో దక్కించుకోవాలని చూస్తోంది.

దృష్టిసారించే ఆటగాళ్లు

క్రిస్ లిన్, పాట్ కమిన్స్, క్రిస్ మోరిస్, షెల్డన్ కాట్రెల్, నాథన్ కౌల్టర్​నీల్, డేల్ స్టెయిన్, మోహిత్ శర్మ, జయదేవ్ ఉనద్కత్, బరీందర్ శరణ్, తుషార్ దేశ్ పాండే, జేమ్స్ నీషమ్, మార్కస్ స్టొయినిస్, క్రిస్ జోర్డాన్, సిమన్స్​.

ఇదీ చదవండి: విశాఖ వన్డేలో సత్తాచాటితే విరాట్ ఖాతాలో అరుదైన రికార్డులు

ABOUT THE AUTHOR

...view details