ఐసీసీ నిబంధన ప్రకారం.. మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఎవరైనా ఆటగాడికి తలపై లేదా మెడపై గాయమై.. తల తిరిగినట్లు, మైకం కమ్మినట్లు అనిపిస్తే ఆ ఆటగాడు కంకషన్‌కు గురయ్యాడని భావిస్తారు. ఆ జట్టు వైద్యుడు ఆ ఆటగాడిని పరీక్షించి అతని పరిస్థితిని అంచనా వేస్తాడు.
ఒకవేళ ఆ ఆటగాడు నిజంగానే కంకషన్‌కు గురైతే అతని స్థానంలో మరో ఆటగాడ్ని మైదానంలోకి పంపేందుకు మ్యాచ్ రిఫరీకి విన్నవించాల్సి ఉంటుంది. ఆ ఆటగాడు మ్యాచ్‌లో ఏ విధంగా కంకషన్‌కు గురి కావాల్సి వచ్చింది? ఏ సమయంలో అలా జరిగింది? అతనికి బదులుగా సరైన ప్రత్నామ్నాయ ఆటగాడి(బౌలర్ స్థానంలో బౌలర్, బ్యాట్స్‌మన్ స్థానంలో బ్యాట్స్‌మన్)గా ఎవరిని జట్టు ఆడించాలనుకుంటుంది? అనే వివరాలను రిఫరీ ముందుంచాలి.