వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ ఇచ్చిన ఐదు మిలియన్ డాలర్ల విరాళం దుర్వినియోగమైందని వెస్టిండీస్ దిగ్గజ బౌలర్ మైకెల్ హోల్డింగ్ ఆరోపించాడు. విండీస్ బోర్డు ఆర్థిక నిర్వహణ బాగా లేదని అన్నాడు.
బీసీసీఐ విరాళాన్ని విండీస్ క్రికెట్ బోర్డు ఏం చేసింది? - michael holdings
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు ఇచ్చిన విరాళం దుర్వినియోగం అయిందని ఆ దేశ మాజీ క్రికెటర్ మైకెల్ హోల్డింగ్స్ ఆరోపించాడు. దానికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని అన్నాడు.
బీసీసీఐ విరాళాన్ని విండీస్ క్రికెట్ బోర్డు ఏం చేసింది?
"2013-14లో బీసీసీఐ.. వెస్టిండీస్ మాజీ ఆటగాళ్ల కోసం ఐదు మిలియన్ డాలర్ల విరాళమిచ్చింది. నాకేమీ వద్దు కానీ నేనూ మాజీ ఆటగాణ్నే. ఒక్క మాజీ ఆటగాడికైనా విండీస్ బోర్డు డబ్బులిచ్చినట్లు నేను వినలేదు. ఇచ్చి ఉంటే చాలా ప్రచారం చేసుకునేవాళ్లు. ఆ ఐదు మిలియన్ డాలర్లు ఏమయ్యాయి? త్వరలోనే వివరాలు వెల్లడిస్తా" అని హోల్డింగ్ చెప్పాడు.
ఇదీ చూడండి..'28 ఏళ్ల అనుబంధం.. ఇప్పుడు చాలా వెలితిగా ఉంది'