తెలంగాణ

telangana

ETV Bharat / sports

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ - cricket

కింగ్​స్టన్ వేదికగా భారత్​తో జరుగుతోన్న రెండో టెస్టులో టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియాలో మార్పులేమీ లేవు. విండీస్​ జట్టులో షై హోప్ స్థానంలో హామిల్టన్ జట్టులోకి వచ్చాడు.

మ్యాచ్

By

Published : Aug 30, 2019, 8:26 PM IST

Updated : Sep 28, 2019, 9:45 PM IST

ఇప్పటికే టీ20, వన్డే సిరీస్​లు కైవసం చేసుకున్న టీమిండియా టెస్టుల్లోను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. మొదటి టెస్టులో 318 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన కోహ్లీసేన రెండో టెస్టులో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. కింగ్ స్టన్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్​లో మొదటగా టాస్ గెలిచిన కరీబియన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.

మొదటి టెస్టులో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది టీమిండియా. వెస్టిండీస్​ జట్టులో ఒక మార్పు చోటుచేసుకుంది. షై హోప్ స్థానంలో హామిల్టన్ జట్టులోకి వచ్చాడు.

ఆల్​రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటుతోంది టీమిండియా. ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురావడంలో సఫలమవుతోంది. బ్యాటింగ్​లో కోహ్లీ, రహానే, విహారి సత్తాచాటారు. బౌలింగ్​లో ఇషాంత్, బుమ్రా చెలరేగుతున్నారు. ఇదే పంతా కొనసాగిస్తే ఈ మ్యాచ్​లోనూ విజయం ఖాయం.

విండీస్​ విషయానికొస్తే వరుస వైఫల్యాలతో సతమతమవుతోంది. టాప్ క్లాస్ ఆటగాళ్లు ఆ జట్టు సొంతమైనా.. జట్టుగా ఆడటంలో విఫలమవుతున్నారు. షిమ్రాన్ హిట్మైర్, షాయ్ హోప్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. రెండో ఇన్నింగ్స్​లో వంద పరుగులకే ఆలౌటై అప్రతిష్ఠ మూటగట్టుకుంది కరీబియన్ జట్టు. బౌలింగ్​లో ఫర్వాలేదనిపిస్తున్నా.. సమష్టిగా రాణించలేకపోతున్నారు.

ఇవీ చూడండి.. 'అందుకే అతడ్ని ఎంపిక చేయలేదు'

Last Updated : Sep 28, 2019, 9:45 PM IST

ABOUT THE AUTHOR

...view details