భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది వెస్టిండీస్. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా ఆడే ఈ మ్యాచ్లో పిచ్ బ్యాటింగ్కు అనుకూలించే అవకాశముంది. స్పిన్నర్లు సత్తాచాటే అవకాశమూ లేకపోలేదు.
1-0 తేడాతో ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఇందులో గెలిచి సిరీస్ చేజిక్కించుకోవాలని భావిస్తోంది.
ఇప్పటికే టీ-20 సిరీస్ కోల్పోయింది విండీస్. వన్డే సిరీస్ దక్కే అవకాశం ఎటూలేదు. మొదటి వన్డే వర్షం వల్ల రద్దవగా.. రెండో వన్డేలో భారత్ విజయం సాధించింది. ఇప్పుడు మూడో వన్డేలో గెలిచి సిరీస్ సమం చేయాలని ఆరాటపడుతోంది.