ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు జోరందుకున్నాయి. వెస్టిండీస్‌లోనూ ఇప్పటికే ఈ సందడి ప్రారంభమైంది. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న కరీబియన్ జట్టు.. ఇక్కడే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంది. వెస్టిండీస్ ఆటగాళ్లంతా క్రిస్మత్ తాత టోపీలు ధరించి.. పాటలు పాడుతూ కనిపించారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది విండీస్ బోర్డు.
" లేడీస్ అండ్ జెంటిల్మెన్.. మీరు ఇప్పటివరకు అందుకున్న క్రిస్మస్ శుభాకాంక్షల్లో ఇదే బెస్ట్ గ్రీటింగ్!. మెన్ ఇన్ మెరూన్ స్టయిల్లో క్రిస్మస్."
-విండీస్ బోర్డు
క్రిస్మస్ తాతగా కోహ్లీ సర్‌ప్రైజ్...
మైదానంలో ఎంతో దూకుడుగా ఉండే కోహ్లీ.. బయట మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటాడు. తన స్టార్‌డమ్‌ను పక్కనపెట్టి సాధారణ వ్యక్తిలా కనిపిస్తుంటాడు. తాజాగా కోహ్లీ చిన్నారుల కోసం శాంటాక్లాజ్ తాతయ్యలా మారాడు. క్రిస్మస్ పండుగ ముందుగానే కోల్‌కతాలోని చిన్నారుల అనాథాశ్రమానికి శాంటాక్లాజ్ రూపంలో వెళ్లి.. అందర్నీ సర్‌ప్రైజ్ చేశాడు. వారు కోరుకున్న బహుమతులు అందించి సంతోషంలో ముంచెత్తాడు.
కటక్ వేదికగా ఆదివారం వెస్టిండీస్‌తో భారత్ నిర్ణయాత్మక వన్డే ఆడనుంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. తొలి మ్యాచ్ విండీస్ గెలవగా, రెండో మ్యాచ్‌లో కోహ్లీసేన విజయం సాధిచింది. ఆఖరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను గెలవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది.