ఇంగ్లాండ్ పర్యటనలో ప్రపంచవ్యాప్తంగా నల్లజాతీయులపై జరుగుతున్న దాడులకు నిరసన చేపట్టాలని వెస్టిండీస్ జట్టు నిర్ణయించింది. దీనికి సంఘీభావంగా ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో జెర్సీ కాలర్‌పై 'బ్లాక్ లివ్స్ మ్యాటర్' లోగోను ధరించనున్నట్లు కెప్టెన్ జాసన్ హోల్డర్ తెలిపాడు. పోలీసుల దాడిలో మృతి చెందిన అమెరికా నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్‌కు సంఘీభావాన్ని తెలపడం సహా ఈ దాడులపై ప్రజల్లో అవగాహన కల్పించడం తమ బాధ్యతని వెల్లడించాడు హోల్డర్.
"క్రికెట్లోనే కాకుండా వెస్టిండీస్ జట్టుకు ఇది చరిత్రలో కీలకమైన క్షణం. విజ్డెన్ ట్రోఫీని గెలుచుకోవడానికి ఇంగ్లాండ్ వచ్చాం. కానీ, ప్రపంచవ్యాప్తంగా నల్లజాతీయులపై జరుగుతున్న దాడులు మమ్మల్ని కదిలించాయి. అందుకే ఆ నిరసనలకు మద్దతుగా నిలవాలని నిర్ణయించాం. వెస్డిండీస్ క్రికెట్‌కు సంబంధించిన గొప్ప, విభిన్న చరిత్ర గురించి మాకు అవగాహన ఉంది. ".