డిసెంబరు 6 నుంచి వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ నేపథ్యలో వన్డే, టీ20 సిరీస్‌కు జట్లను ప్రకటించింది కరీబియన్ బోర్డు. రెండు సిరీస్‌లకూ కీరన్ పొలార్డే సారథ్యం వహించనున్నాడు. పొట్టి ఫార్మాట్లో నికోలస్ పూరన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. వన్డేల్లో షాయ్ హోప్ ఆ బాధ్యతలు నిర్వహించనున్నాడు.
ఇటీవల అఫ్గాస్థాన్తో జరిగిన సిరీస్‌లో విండీస్ పరాజయం చెందినప్పటికీ మళ్లీ అదే జట్టుపై నమ్మకముంచింది కరీబియన్ క్రికెట్ బోర్డు. అఫ్గాన్‌తో సిరీస్‌లో ఆడిన వారికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది.
వెస్టిండీస్ వన్డే జట్టు:
సునీల్ అంబ్రిస్, షాయ్ హోప్, ఖేరీ పియర్రే, రోస్టన్ ఛేజ్, అల్జారీ జోసెఫ్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), షెల్డన్ కాట్రెల్, బ్రెండన్ కింగ్, నికోలస్ పూరన్, షిమ్రన్ హిట్మైర్, ఎవిన్ లూయిస్, షెఫెర్డ్, జేసన్ హోల్డర్, కీమో పాల్, హెడెన్ వాల్ష్ జూనియర్.