ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య జరుగుతోన్న తొలి టెస్ట్‌లో మూడో రోజు పర్యటక వెస్టిండీస్ జట్టు అధిపత్యం సాధించింది. విండీస్ బ్యాట్స్‌మెన్ బ్రాత్‌వైట్(125 బంతుల్లో 65 పరుగులు), వికెట్ కీపర్ షేన్ డౌరిచ్(115 బంతుల్లో 61 పరుగులు) అర్ధ సెంచరీలతో చెలరేగారు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో 204 పరుగులు చేసిన ఇంగ్లాండ్ స్కోరును అధిగమించిన కరీబియన్ జట్టు.. 114 పరుగుల ఆధిక్యంలో ఉంది.
57-1 పరుగులతో మూడోరోజు ఆటను ప్రారంభించిన విండీస్.. రెండో సెషన్లో ఇంగ్లండ్ స్కోరు(204)ను అధిగమించింది. ఇదే క్రమంలో బ్యాట్స్‌మెన్ నిలదొక్కుకుని ఆడుతూ వికెట్‌కు కాపాడుకున్నారు. అయితే మరో గంటలో ఆట ముగుస్తుందనగా.. 318 పరుగులకు అలౌట్ అయింది కరీబియన్ జట్టు.