బౌలర్ బంతి వేసే క్రమంలో క్రీజు దాటి అడుగు వేస్తే ఏమౌతుంది..? అంపైర్ 'లెగ్ నోబాల్'గా ప్రకటిస్తాడు. ఒక పరుగు ఇవ్వడమే కాకుండా ఆ బాల్‌కు బదులుగా ఫ్రీ హిట్ కూడా ఇస్తాడు. ఇవి ఒక్కోసారి మ్యాచ్ ఫలితాలను మార్చేస్తుంటాయి. కీలక సమయాల్లో బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ వేయలేక ఇటువంటి అదనపు పరుగులు ఇచ్చుకుంటారు. అయితే అలాంటి బంతిని అంపైర్లే రద్దు చేసే విధంగా.. దిగ్గజ ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ గతంలో ఓ ప్రయత్నం చేశాడు. తాజాగా అదే పద్ధతిని అనుసరించాడు వెస్టిండీస్ క్రికెటర్ కీరన్ పొలార్డ్. ఇది నెట్టింట వైరల్‌గా మారింది.
'నో బాల్' రద్దవ్వాలా.. ఇది చూడండి - నోబాల్
క్రికెట్లో బౌలర్లు లెగ్ నోబాల్స్ వేయడం ఎప్పుడూ చూస్తుంటాం. బంతి వేసేటప్పుడు బౌలర్ క్రీజు దాటి అడుగు బయటకు వేస్తే అంపైర్లు దాన్ని నోబాల్‌గా ప్రకటిస్తారు. దీని వల్ల ప్రత్యర్థి జట్టుకు ఎక్స్ట్రా పరుగులు లభిస్తాయి. అయితే ఓ టెక్నిక్‌తో ఆ నోబాల్‌ను రద్దు చేసి.. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా బౌలర్ చేయొచ్చు. అదెలాగంటారా... మీరూ చూసేయండి.
సోమవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో వన్డేలో.. వెస్టిండీస్ సారథి, ఆల్‌రౌండర్ పొలార్డ్ 25వ ఓవర్ వేశాడు. ఆ సమయంలో అఫ్గాన్ ఆటగాళ్లు ఆస్గర్ అఫ్గాన్, నజీబుల్లా జద్రాన్ క్రీజులో ఉన్నారు. అయితే పరుగెత్తుకుంటూ వచ్చి బాల్‌ను వేయబోయే క్రమంలో పొలార్డ్ ఒక్కసారిగా ఆగిపోయాడు. అప్పుడు ఏమైందంటే.. ఆ బంతి వేసే క్రమంలో ఓవర్ స్టెపింగ్ కావడం వల్ల అంపైర్ నో బాల్ అని అరిచాడు. అంతే పొలార్డ్ బంతిని విడవకుండా చేతితో పట్టుకుని అలానే ముందుకు వెళ్లిపోయాడు. ఇంకేముంది దాన్ని డెడ్‌బాల్‌గా ప్రకటించాడు అంపైర్. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ జట్టును ఓడించి వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది కరీబియన్ జట్టు.
గతంలో ఇలాంటి పద్ధతినే ఫాలో అయ్యేవాడు అక్తర్. అంపైర్ నో బాల్ అని అరవగానే ఇలానే.. బంతిని వదలకుండా ముందుకెళ్లిపోయేవాడు. ఫలితంగా దాన్ని డెడ్ బాల్‌గా పరిగణిస్తారు. ఇలా ఎన్నో మ్యాచ్‌ల్లో ఎక్స్ట్రాలను తగ్గించాడీ దాయాది ఆటగాడు.