తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఖరీదైన ఆటగాడికి.. జట్టులో దక్కని చోటు..! - gayle afghanistan

'ద హండ్రెడ్' పేరుతో ఇంగ్లాండ్ అండ్​ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) నిర్వహించనున్న టోర్నీ వేలం జాబితాలో ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు క్రిస్​గేల్. అయితే అఫ్గానిస్థాన్​తో జరగనున్న మూడు ఫార్మాట్​ల సిరీస్​కు విండీస్​ జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు గేల్​.

క్రిస్ గేల్

By

Published : Oct 16, 2019, 3:58 PM IST

ఇంగ్లాండ్ అండ్​ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న టోర్నీ 'ద హండ్రెడ్'. ఈ వంద బంతుల క్రికెట్ వేలం జాబితాలో కొందరు ఆటగాళ్లు భారీ ధరలకు నామినేషన్​ వేశారు. వెస్టిండీస్ విధ్వంసకారుడు క్రిస్​ గేల్, ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు.

అత్యధిక ప్రారంభ ధర 1,25,000 యూరోలు (రూ. 98 లక్షలకు పైగా) కింద కోట్​ చేసిన ఆరుగురు ఆటగాళ్లలో గేల్, స్మిత్ ఉన్నారు. వీరితో పాటు మిషెల్ స్టార్క్, లసిత్ మలింగ, కగిసో రబాడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

అఫ్గానిస్థాన్​తో సిరీస్​లో గేల్​కు దక్కని చోటు..

వంద బంతుల టోర్నీలో ఖరీదైన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న క్రిస్​గేల్​కు చుక్కెదురైంది. అఫ్గానిస్థాన్​తో జరగనున్న ఓ టెస్టు, 3 టీ20లు, 3 వన్డేల సిరీస్​కు గేల్​ను ఎంపిక చేయలేదు విండీస్​ సెలక్టర్లు. అతడితోపాటు ఆండ్రూ రసెల్​నూ పక్కన పెట్టారు.

ఇటీవల జరిగిన కరీబియన్ ప్రిమియర్ లీగ్​లో ప్రదర్శన ఆధారంగా సెలక్టర్లు జట్టును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. పరిమిత ఓవర్ల క్రికెట్​కు కీరన్ పొలార్డ్​ విండీస్ సారథిగా వ్యవహరిస్తుండగా.. టెస్టు కెప్టెన్​గా జేసన్ హోల్డర్​కు పగాలు అప్పగించారు. చాలా రోజులుగా సరైన ప్రదర్శన చేయని హోల్డర్​ను... వన్డే, టీ20 సిరీస్​ల్లోనూ ఎంపిక చేయడం విశేషం.

నవంబరు 5 నుంచి డిసెంబరు 1 వరకు ఈ మ్యాచ్​లు జరగనున్నాయి. భారత్​లోని దెహ్రాదూన్ వేదికగా అప్గాన్​ - విండీస్ జట్లు తలపడనున్నాయి.

ఇదీ చదవండి: ఐసీసీ 'సూపర్​' నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: సచిన్

ABOUT THE AUTHOR

...view details