రిటైర్మెంట్పై యూటర్న్ తీసుకున్న వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో... మళ్లీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌కు ఈ క్రికెటర్‌ను ఎంపిక చేశారు విండీస్ సెలక్టర్లు. ఆ దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు కామెరాన్‌తో పొసగకపోవడం వల్ల బ్రావో 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
ఈరోజు ఐర్లాండ్‌తో పొట్టి ఫార్మాట్ సిరీస్‌కు జట్టు ప్రకటించిన విండీస్ బోర్డు.. టెస్టు కెప్టెన్ జాసన్ హోల్డర్‌కు విశ్రాంతినిచ్చింది. ఫాబియో అలెన్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. ఫలితంగా ఈ మ్యాచ్‌లకు అందుబాటులోకి రాలేదు. ఇతడి స్థానంలో బ్రావోను ఎంపిక చేస్తున్నట్లు వెల్లడించారు. జనవరి 15, 18, 19 తేదీల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ గ్రెనెడా వేదికగా జరగనుంది.
పొలార్డ్ సారథిగా మారాకే...
విండీస్ క్రికెట్ బోర్డులో మార్పులు చోటు చేసుకోవడమే తన యూటర్న్‌కు కారణమని బ్రావో వెల్లడించాడు. కామెరాన్ ఆటగాళ్ల కెరీర్లను నాశనం చేస్తున్నారని బ్రావో జట్టుకు దూరమయ్యాడు. అయితే డేవ్ స్థానంలో రికీ స్కెరిట్ బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. కోచ్ ఫిల్ సిమ్మన్స్, సారథి కీరన్ పొలార్డ్‌తో కూడిన ప్రస్తుత నాయకత్వ బృందంతో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇటీవలె తెలిపాడు బ్రావో. 2016 సెప్టెంబర్‌లో పాకిస్థాన్‌తో చివరి మ్యాచ్ ఆడిన ఇతడు... ఫ్రాంచైజీ క్రికెట్లో మాత్రం క్రమం తప్పకుండా అలరిస్తున్నాడు.
జట్టు...
కీరన్ పొలార్డ్(కెప్టెన్), డ్వేన్ బ్రావో, షెల్డన్ కాట్రెల్, షిమ్రన్ హెట్మెయిర్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, కేరీ ఫియర్రీ, నికోలస్ పూరన్, రావ్‌మెన్ పోవెల్, రూథర్డ్‌ఫోర్డ్, సిమన్స్, హెడెన్ వాల్ష్ జూనియర్, కెస్రిక్ విలియమ్స్.