తెలంగాణ

telangana

ETV Bharat / sports

తొలి టెస్టు: 222 పరుగులకు వెస్టిండీస్​ ఆలౌట్​ - ఇషాంత్ శర్మ

టెస్టు ఛాంపియన్​షిప్​లో భాగంగా జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్​ను 222 పరుగులకు ఆలౌట్​ చేసి 75 పరుగుల ఆధిక్యం సాధించింది కోహ్లీసేన.

తొలి టెస్టు: 222 పరుగులకు వెస్టిండీస్​ ఆలౌట్​

By

Published : Aug 24, 2019, 9:42 PM IST

Updated : Sep 28, 2019, 3:59 AM IST

ఆంటిగ్వా వేదికగా టీమిండియాతో జరుగుతోన్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్​లో ఆతిథ్య వెస్టిండీస్ 222 పరుగులకు ఆలౌటైంది. ఓవర్​నైట్​ స్కోరు 189/8తో ఆట ప్రారంభించిన కరీబియన్​ జట్టు.. 74.2 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయింది.

ఐదు వికెట్లు తీసిన టీమిండియా బౌలర్ ఇషాంత్ శర్మ

రోస్టన్ చేజ్ 48 పరుగులు చేయగా, కెప్టెన్ జేసన్ హోల్డర్ 39, హెట్మయిర్ 35 పరుగులు మాత్రమే చేశారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ 5 వికెట్లు పడగొట్టాడు. మిగతా వారిలో షమి, జడేజా రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. బుమ్రా ఒక వికెట్ తీశాడు. 75 పరుగుల ఆధిక్యంలో ఉంది కోహ్లీసేన.​

ఇది చదవండి: ఇంగ్లాండ్​ బ్రెయిన్​ లేకుండా బ్యాటింగ్ చేసింది: జోఫ్రే బాయ్​కాట్

Last Updated : Sep 28, 2019, 3:59 AM IST

ABOUT THE AUTHOR

...view details