అంతర్జాతీయ క్రికెట్‌లో మళ్లీ కనువిందు చేయనున్నాడు విండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో. 2018లోనే ఆటకు వీడ్కోలు పలికిన ఈ కరీబియన్ ప్లేయర్.. తాజాగా తన రిటైర్మెంటును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్లో చోటు దక్కించుకోవాలని భావిస్తున్నాడు.
"అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేయాలని ఉంది. ఈ విషయాన్ని అభిమానులు, నా శ్రేయోభిలాషులకు చెబుతున్నా. నా రిటైర్మెంటుపై నిర్ణయం మార్చుకోడానికి కారణం మా దేశ క్రికెట్ బోర్డు పరిపాలనలో చాలా మార్పులు చోటు చేసుకోవడమే. అప్పట్లో బోర్డు పెద్దల వ్యవహారం సరిగా లేదనే క్రికెట్ నుంచి వైదొలిగాను. ఇప్పుడు పాలన మారడం వల్ల మనసు మార్చుకున్నా"
--డ్వేన్ బ్రావో, క్రికెటర్
విండీస్ కోచ్ ఫిల్ సిమన్స్, కెప్టెన్ కీరన్ పోలాల్డ్ నాయకత్వంలో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపాడు బ్రావో. వీరిద్దరితో మంచి సంబంధాలున్నాయని పరోక్షంగా తెలిపాడు.