తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అమ్మాయిల కోసం కండలు పెంచా.. ఇప్పుడు ఇలా'

వెస్టిండీస్​ క్రికెటర్​ ఆండ్రూ రసెల్​ తెలియని భారత క్రికెట్​ అభిమానులు ఉండరేమో. ఎందుకంటే ఆ దేశ క్రికెట్​లోనే కాకుండా ఐపీఎల్​లోనూ తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. విధ్వంసకర వీరుడిగా పేరు తెచ్చుకున్న ఈ ఆల్​రౌండర్​.. అప్పట్లో కండలు తిరిగిన దేహంతో కనిపించేవాడు. ప్రస్తుతం ఈ విషయంలో పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాడు.

Andre Russell
'అప్పుడు అమ్మాయిల కోసం కండలు పెంచా.. ఇప్పుడు ఇలా'

By

Published : Feb 15, 2020, 8:08 AM IST

Updated : Mar 1, 2020, 9:35 AM IST

విండీస్​ ఆల్​రౌండర్​ ఆండ్రూ రసెల్​.. విధ్వంసకర ఆటతీరుకు మారుపేరు. టీ20 ఫార్మాట్​లో ఇతడు అడుగుపెడితే ఫలితాలు తారుమారు అవ్వాల్సిందే. అలాంటి ఆటగాడు కెరీర్​ ఆరంభంలో విపరీతంగా కండలు పెంచడంపైనే దృష్టి పెట్టి కాళ్ల నొప్పులు బాధిస్తున్నా నిర్లక్ష్యం చేశాడట. అంతేకాకుండా ఆ బాధను తట్టుకునేందుకు ఎక్కువగా పెయిన్​ కిల్లర్స్​ వాడేవాడట. ఇదంతా అమ్మాయిలను ఆకర్షించడానికి చేసినట్లు తాజాగా వెల్లడించాడు రసెల్​. అప్పుడు చేసిన నిర్లక్ష్యం వల్ల ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నానని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.

అమ్మాయిల కోసం కండలు పెంచా.. ఇప్పుడు ఇలా

" 23 ఏళ్లున్నప్పుడు మోకాళ్ల నొప్పులు బాధించాయి. ఆ సమయంలో పెయిన్‌ కిల్లర్లతో నెట్టుకొచ్చాను. కాళ్ల ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టకుండా అమ్మాయిలను ఆకర్షించడానికి శరీరంపైనే దృష్టిసారించా. మంచి శరీరాకృతి కలిగినా, కాళ్ల ఇబ్బంది ఉంటే ఎవరికీ ప్రయోజనం లేదు. యువ క్రికెటర్లు ఎవరైనా జిమ్‌కు వెళ్లినప్పుడు అన్ని కసరత్తులూ చేయాలి. అలా చేస్తేనే శరీరం దృఢంగా మారుతుంది. నేను అలాంటి తప్పులు చేయకపోతే మరింత బాగా రాణించేవాడిని. నాకు కాళ్ల నొప్పులు ప్రారంభమైనప్పుడు ఎవరైనా మంచి సలహా ఇచ్చుంటే సర్జరీ చేసుకోవాల్సిన పని తప్పేది"

--ఆండ్రూ రసెల్​, వెస్టిండీస్​ క్రికెటర్​

ఐపీఎల్లో దూకుడైన బ్యాటింగ్‌తో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు రసెల్‌. గతేడాది 14 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసి 510 పరుగులు చేశాడు.

Last Updated : Mar 1, 2020, 9:35 AM IST

ABOUT THE AUTHOR

...view details