జమైకా వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 117 పరుగులకు ఆలౌట్ అయింది వెస్టిండీస్. ఓవర్‌నైట్ స్కోరు 87/7తో ఆట ప్రారంభించిన కరీబియన్లు.. మిగిలిన వికెట్లు కోల్పోయి మరో 30 పరుగులు మాత్రమే జోడించగలిగారు. ఇందులో షమి, ఇషాంత్, జడేజా తలో వికెట్ దక్కించుకున్నారు.
117 పరుగులకే కుప్పకూలిన విండీస్ - బుమ్రా
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ను 117 పరుగులకే కట్టడి చేసి 299 పరుగుల ఆధిక్యం సాధించింది టీమిండియా. బుమ్రా ఆరు వికెట్లు తీశాడు.
117 పరుగులకు వెస్టిండీస్ ఆలౌట్
అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌట్ అయింది కోహ్లీసేన. విహారి శతకం చేయగా, ఇషాంత్ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్.. భారత బౌలర్ బుమ్రా ధాటికి నిలబడలేకపోయింది. తక్కువ పరుగులకే వికెట్లు టపాటపా పడ్డాయి. తొలి ఐదుగురు బ్యాట్స్‌మెన్ బుమ్రా చేతిలోనే పెవిలియన్ బాట పట్టడం విశేషం.
Last Updated : Sep 29, 2019, 2:43 AM IST