గబ్బా టెస్టులో బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేసి ప్రశంసలు అందుకున్నాడు వాషింగ్టన్ సుందర్. ఆ చారిత్రక గెలుపులో అతడు కీలకంగా మారతాడని ఎవరూ అనుకోలేదు. అయితే ఆ టెస్టు మ్యాచ్‌కు ముందు అతడి వద్ద ప్యాడ్లు కూడా లేవని తెలిపారు ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్.
టీ20 సిరీస్ కోసమే సుందర్ ఆస్ట్రేలియాకు వచ్చాడు. టెస్టు జట్టులో లేకపోయినా.. ఆసీస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లైయన్ శైలిని అనుకరిస్తూ బౌలింగ్ వేసి.. భారత బ్యాట్స్‌మెన్ సన్నమద్ధమవడానికి నెట్స్‌లో సహకరించాడు.
ఆఖరి టెస్టుకు ముందు అశ్విన్ గాయపడటం వల్ల సుందర్‌కు జట్టులో తొలిసారిగా అవకాశం లభించింది. టీ20ల కోసమే వచ్చిన సుందర్ వద్ద నీలి రంగు ప్యాడ్లు తప్ప తెల్లవి లేవు. నెట్స్‌లోనూ బ్లూ ప్యాడ్లతోనే ప్రాక్టీస్ చేశాడు.
అయితే సుందర్‌కు సరిగ్గా సరిపోయే ప్యాడ్లను వెతకడానికి టీమ్ఇండియా సహాయక సిబ్బంది చాలా శ్రమించాల్సి వచ్చిందని చెప్పారు శ్రీధర్. "ఎన్నో ప్యాడ్లను ప్రయత్నించినా.. అతడు చాలా పొడుగ్గా ఉండటం వల్ల సరిపోయేవి కావు. కొవిడ్ కారణంగా ఆసీస్ నుంచీ సహాయం లభించలేదు. ఎట్టకేలకు మ్యాచ్ మొదలయ్యాక ఓ దుకాణంలో ప్యాడ్లు దొరికాయి," అని తెలిపారు.
ఇదీ చూడండి:యువ క్రికెటర్లకు బహుమతిగా మహీంద్ర ఖరీదైన కొత్త కార్లు