టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ మధ్య సోషల్ మీడియా వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలుసార్లు కవ్వింపులకు పాల్పడిన వీరిద్దరూ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా పీటర్సన్ పెట్టిన వీడియోకు యువీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు.
పీటర్సన్‌కు యువీ కౌంటర్.. అదిరిపోలా! - Yuvraj Singh trolls Kevin Pietersen over 'pie' chucker post
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు పీటర్సన్‌ను మరోసారి కవ్వించాడు. పీటర్సన్ పెట్టిన పోస్టుకు యువీ కౌంటర్ ఇచ్చాడు.
యువరాజ్
పీటర్సన్ తన ఇన్‌స్టా వేదికగా ఓ వీడియో షేర్ చేశాడు. ఇందులో న్యూజిలాండ్‌పై తాను ఆడిన 'స్విచ్ హిట్' షాట్లు కనువిందు చేస్తున్నాయి. "జస్ట్ డీలింగ్ విత్ మై ఫేవరేట్ షాట్స్" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు పీటర్సన్. దీనికి బదులుగా యువీ "కొన్నిసార్లు ఆ షాట్లలో విఫలమయ్యావు కూడా" అంటూ కామెంట్ పెట్టాడు.
లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం పీటర్సన్ సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో టచ్‌లో ఉంటున్నాడు. కోహ్లీ, రోహిత్‌లతో ఇటీవలే ఇన్‌స్టా లైవ్‌లో పాల్గొన్నాడు.