తెలంగాణ

telangana

ETV Bharat / sports

గంగూలీని ట్రోల్ చేసిన సచిన్.. నెట్టింట వైరల్ - సచిన్ తెందూల్కర్, గంగూలీ

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, సచిన్ తెందూల్కర్ మధ్య సామాజిక మాధ్యమాల్లో సరదా సంభాషణ జరిగింది. ఇది కాస్త నెట్టింట వైరల్​గా మారింది.

Well done
గంగూలీ

By

Published : Jan 10, 2020, 1:23 PM IST

బీసీసీఐ అధ్యక్షుడయ్యాక సౌరభ్ గంగూలీ బిజీబిజీగా గడుపుతూనే సామాజిక మాధ్యమాల్లో పోస్టులతో సందడి చేస్తున్నాడు. తాజాగా ఈ మాజీ క్రికెటర్​ పెట్టిన పోస్ట్​పై సచిన్ కామెంట్ చేశాడు. ప్రస్తుతం వీరి మధ్య సంభాషణ నెట్టింట వైరల్​గా మారింది.

ఏం జరిగింది..!

దాదా తన ఇన్‌స్టాగ్రామ్‌లో "ఉదయాన్నే చల్లని వాతావరణంలో మంచి ఫిట్‌నెస్‌ సెషన్‌ను చేస్తే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది" అని పోస్ట్‌ చేశాడు. దీనికి సచిన్‌.."‘వెల్‌డన్‌ దాది! ఏం చెప్పావ్‌" అని సరదాగా కామెంట్ చేశాడు. అయితే దాదా సచిన్‌ కామెంట్‌కు "థాంక్యూ ఛాంపియన్‌. ఎల్లప్పుడూ ఫిట్‌నెస్‌పైనే దృష్టి. మన అద్భుతమైన శిక్షణ రోజులు నీకు గుర్తున్నాయా" అని రిప్లై ఇచ్చాడు. దీనికి సచిన్ "అవును దాది.. శిక్షణలో నువ్వు ఎంత ఎంజాయ్‌ చేశావో అందరికీ గుర్తుంది. ప్రత్యేకంగా స్కిప్పింగ్‌లో" అని బదులిచ్చాడు. ఈ దిగ్గజ క్రికెటర్ల సరదా సంభాషణ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

సచిన్-గంగూలీ సంభాషణ

సచిన్-గంగూలీ కలిసి టీమిండియాకు ఎన్నో అపురూప విజయాలు అందించారు. ఓపెనర్లుగా బరిలోకి దిగి రికార్డుల భాగస్వామ్యాల్ని నెలకొల్పారు. వీరిద్దరు కలిసి 136 ఇన్నింగ్స్‌ల్లో 49.32 సగటుతో 6,609 పరుగులు చేశారు. వన్డే, టెస్టుల్లో సచిన్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా, శతక శతకాలు సాధించిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. భారత్‌ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో క్రికెటర్‌గా దాదా ఘనత సాధించాడు.

ఇవీ చూడండి.. అందుకోసం కోహ్లీని అనుసరిస్తా: లబుషేన్

ABOUT THE AUTHOR

...view details