రాబోయే మహిళల వన్డే ప్రపంచకప్ గురించి మాట్లాడిన ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్.. ఆ సమయానికి తాము సిద్ధంగానే ఉంటామని చెప్పింది. న్యూజిలాండ్ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. ఓ క్రీడాకారిణిగా, ప్రస్తుత పరిస్థితులు త్వరగా చక్కదిద్దుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. అయితే నిర్వహకులు తీసుకునే నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది.
"టోర్నీ నిర్వహణపై ఐసీసీ ఆలోచిస్తోంది. ఎందుకంటే ప్రపంచకప్‌నకు సిద్ధమయ్యేందుకు అన్ని జట్లకు తగినంత సమయం ఉందా? ఇంకా కొన్ని క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు జరగాలి. ఈ పరిస్థితి ఎలా చక్కదిద్దుకుంటుందో చూడాలి. దీనితో పాటే ప్రపంచకప్ జరుగుతుందా లేదా అని సందేహాలు వస్తున్నాయి. ఓ క్రీడాకారిణిగా నేనైతే టోర్నీ అనుకున్న ప్రకారం జరగాలనే అనుకుంటాను. కానీ నిర్వహకులు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు సమ్మతమే"