రేపటి(గురువారం) నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ధర్మశాల వేదికగా జరగనుంది. అయితే ఈ పోరుకు రెండు విషయాలు అడ్డంకిగా నిలుస్తున్నాయి. అందులో ఒకటి వర్షం ముప్పు, రెండోది కరోనా ప్రభావం.
వరుణుడు ముప్పు?
న్యూజిలాండ్ పర్యటనలో తీవ్రంగా నిరాశపర్చిన కోహ్లీసేన.. స్వదేశంలో జరిగే ఈ సిరీస్‌తో ఫామ్‌లోకి రావాలని భావిస్తోంది. గాయాల నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చిన హార్దిక్, భువనేశ్వర్, ధావన్‌లు సత్తా చాటాలని చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు భారీ వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అంచనా.
కరోనా దెబ్బకు స్టేడియం ఖాళీగానే!
దేశంలో కరోనా బాధితుల పెరుగుతున్న దృష్ట్యా మైదానం చాలా వరకు ఖాళీగానే దర్శనమివ్వనుంది. దాదాపు 40 శాతం మేర టికెట్లు ఎవరూ కొనుగోలు చేయలేదని నిర్వహకులు చెప్పారు.
టీమిండియా సారథి కోహ్లీ-దక్షిణాఫ్రికా కెప్టెన్ డికాక్ శిఖర్ ధావన్, పృథ్వీ షా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), కేఎల్ రాహుల్, మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, చాహల్, జస్ప్రీత్ బుమ్రా, నవదీప్ సైనీ, కుల్దీప్ యాదవ్, శుభ్‌మన్ గిల్
క్వింటన్ డికాక్ (కెప్టెన్), బవుమా, వాన్ డర్ డసేన్, డుప్లెసిస్, కైల్ వెర్రీన్నే, హెన్రిచ్ క్లాసన్, డేవిడ్ మిల్లర్, జాన్ స్మట్స్, ఫెహ్లుక్వాయో, లుంగి ఎంగిడి, లుతో సిపమ్లా, బ్యూరాన్ హెండ్రిక్స్, ఎన్రిచ్ నోర్ట్జే, జియోర్జే లిండే, కేశవ్ మహారాజ్.