బీసీసీఐపై.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మళ్లీ బెదిరింపులకు పాల్పడింది. సెప్టెంబర్‌లో తాము నిర్వహించే ఆసియాకప్ టీ20 టోర్నీ ఆడాలని హెచ్చరించింది. లేదంటే 2021లో భారత్ ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్‌నకు తమ జట్టును పంపించబోమని చెప్పింది. తాజాగా ఈ మేరకు ప్రకటన చేశాడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సీఈఓ వసీం ఖాన్. అంతేకాకుండా బంగ్లాదేశ్ జట్టు.. పాక్‌లో పర్యటిస్తే ఆసియా కప్ ఆతిథ్య హక్కులను బదిలీ చేస్తారని వచ్చిన వార్తలను వసీం ఖండించాడు.
" ఆసియాకప్ కోసం భారత్ రాకుంటే మేం అక్కడ జరిగే 2021 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనలేం. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) మాకు ఆసియా కప్ ఆతిథ్య హక్కుల్ని ఇచ్చింది. వాటిని మేం ఎవరికీ ఇవ్వం. ఆ అధికారం మాకు లేదు. 2023-2031 మధ్యలో కనీసం మూడు ఐసీసీ టోర్నీల ఆతిథ్య హక్కులు పొందేందుకు ప్రయత్నిస్తాం"