టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీని స్లెడ్జింగ్ చేయడమంటే రెడ్ జోన్లో ఉన్నట్లేనని ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్ అభిప్రాయపడ్డాడు. విరాట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతడిని రెచ్చగొట్టే పనులేవీ చేయకూడదని తమ జట్టు బౌలర్లు నిశ్చయించుకున్నట్లు చెప్పాడు. స్టార్‌స్పోర్ట్స్ క్రికెట్ షోలో ఇటీవలే మాట్లాడిన హేజిల్‌వుడ్.. పలు విషయాలు పంచుకున్నాడు.
"మేం ఈ టెస్టు సిరీస్‌లో ఘర్షణలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాం. చివరి మ్యాచ్ వరకు ఈ నిర్ణయాన్ని పూర్తిగా అమలుచేస్తామని భావిస్తున్నా. కోహ్లీ తగాదాలను బాగా ఇష్టపడతాడు. ఎందుకంటే అదే అతడిలోని అత్యుత్తమ ఆటగాడిని బయటికి తెస్తుంది. ముఖ్యంగా విరాట్ బ్యాటింగ్ చేస్తున్న సమయం బౌలర్లకు నో గో జోన్ లాంటింది"
జోష్ హేజిల్‌వుడ్, ఆస్ట్రేలియా పేసర్