కరోనా విషయంలో ఇంకా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ అన్నాడు. గ్లోబల్ హ్యాండ్‌వాష్ డే సందర్భంగా సచిన్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు చేశాడు.
"ప్రారంభంలో ఉన్న కరోనా నిబంధనల నుంచి మనం ఇప్పుడిప్పుడే విముక్తి పొందుతున్నాం. మళ్లీ సాధారణస్థితికి చేరుకుంటున్నాం. అయినప్పటికీ మనం ఇంకా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. చేతులు కడుక్కోవడం, మాస్క్ ధరించడం, ఆరు అడుగుల దూరం పాటించడం వంటివి మనం మర్చిపోవద్దు. మనం పాటిస్తూ.. ఇతరులకూ ఆదర్శంగా నిలుద్దాం."