తెలంగాణ

telangana

ETV Bharat / sports

'వచ్చే మూడు ప్రపంచకప్​ల్లో రెండు గెలవాలి'

వచ్చే మూడు ప్రపంచకప్​ల్లో రెండింటిని గెలవాలని టీమ్​ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఆశాభావం వ్యక్తం చేశాడు. వరల్డ్​కప్ విజేతగా నిలిస్తే ఆ సంతోషం వేరేలా ఉంటుందని అన్నాడు. రైనాతో జరిగిన ఇన్​స్టా లైవ్​ చాట్​లో పలు విషయాలు పంచుకున్నాడు.

రోహిత్
రోహిత్

By

Published : May 13, 2020, 11:43 AM IST

వచ్చే మూడేళ్లలో కనీసం రెండు ప్రపంచకప్​లు గెలిస్తే బాగుంటుందని అన్నాడు టీమ్​ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ. సురేశ్ రైనాతో జరిగిన ఇన్​స్టాగ్రామ్ లైవ్ చాట్​లో ఈ విధంగా వెల్లడించాడు. ఇప్పటినుంచి 2023 వరకు మూడు ప్రపంచకప్​లు జరగనున్నాయని తెలిపాడు.

"ప్రపంచకప్ గెలవడం అంత తేలిక కాదు. అన్నీ సవ్యంగా జరిగి విజేతగా నిలవడమనేది ఎంతో భావోద్వేగంతో కూడుకున్నది. ఏడు, ఎనిమిది జట్లను దాటుకుని ఫైనల్లో విజయం సాధించడమనేది చాలా కష్టం. కానీ ప్రపంచకప్​ గెలిస్తే మన సంతోషం రెట్టింపవుతుంది. వచ్చే మూడేళ్లలో మూడు ప్రపంచకప్​లు జరగనున్నాయి. రెండు టీ20, ఒక వన్డే ప్రపంచకప్. ఇప్పటికే చాలాసార్లు చెప్పా. టీమ్​ఇండియా ఇందులో కేవలం రెండు వరల్డ్​కప్​లైనా గెలవాలి."

-రోహిత్ శర్మ, టీమ్​ఇండియా ఓపెనర్

గతేడాది జరిగిన ప్రపంచకప్​లో టీమ్​ఇండియా సెమీఫైనల్లో ఓడి ఇంటిముఖం పట్టింది. ఈ టోర్నీలో రోహిత్ శర్మ ఐదు సెంచరీలు చేసి సత్తాచాటినా జట్టు విజేతగా నిలవకపోవడం అభిమానుల్ని బాధించింది.

ABOUT THE AUTHOR

...view details