ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో 104 పరుగుల తేడాతో ఓటమి పాలైంది దక్షిణాఫ్రికా. ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడేందుకు ప్రయత్నిస్తామని చెపుతున్నాడు సఫారీ కెప్టెన్ డుప్లెసిస్. అన్ని విభాగాల్లోనూ అనుకున్నంత మేర రాణించలేకపోయామని చెప్పాడీ బ్యాట్స్‌మెన్.
"కొన్నిసార్లు ప్రత్యర్థులు మనకంటే బాగా ఆడతారు. ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించి విజయం దక్కించుకుంది ఇంగ్లండ్. ఈ ఓటమి నుంచి మేం త్వరగా బయటపడతాం. తర్వాతి మ్యాచ్‌ల్లో మెరుగ్గా ఆడతాం." -డుప్లెసిస్, దక్షిణాఫ్రికా కెప్టెన్
ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ను తాహిర్‌తో వేయించడంపైనా స్పందించాడు కెప్టెన్ డుప్లెసిస్.