తెలంగాణ

telangana

ETV Bharat / sports

'మహీ భాయ్​ను జట్టు చాలా మిస్సవుతుంది' - Dhoni retirement

సీనియర్ క్రికెటర్​ ధోనీని.. భారత క్రికెట్​ జట్టు చాలా మిస్సవుతుందని అన్నాడు స్పిన్నర్ చాహల్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది.

'మహీ భాయ్​ను జట్టు చాలా మిస్సవుతుంది'
మహేంద్ర సింగ్ ధోనీ

By

Published : Jan 28, 2020, 9:43 AM IST

Updated : Feb 28, 2020, 6:08 AM IST

టీమిండియా క్రికెటర్లలో యజ్వేంద్ర చాహల్​కు చమత్కారం కొంచెం ఎక్కువ. మ్యాచ్​లు జరుగుతున్నప్పుడు, జట్టుతో ప్రయాణిస్తున్నప్పుడు.. ఇలా సమయమేదైనా 'చాహల్ టీవీ' పేరుతో సహచరులతో ఇంటర్వ్యూలు, వీడియోలు చేస్తుంటాడు. వారితో పాటే అభిమానుల్ని నవ్విస్తుంటాడు. ఇప్పుడు మాత్రం మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్ ధోనీ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. తను లేని లోటు తెలుస్తుందని, మహీ భాయ్​ను చాలా మిస్సమవుతున్నామని అన్నాడు.

ప్రస్తుతం న్యూజిలాండ్​ పర్యటనలో ఉంది భారత్. ఐదు టీ20ల సిరీస్​లో, ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉంది. మూడో మ్యాచ్​ కోసం హామిల్టన్ చేరుకుంది. ఈ ప్రయాణంలో భాగంగానే చాహల్ ఈ వీడియోను చిత్రీకరించాడు. అయితే ధోనీని.. తమ జట్టంతా మిస్సవుతోందని చెప్పాడు. ప్రయాణంలో ధోనీ.. ఎప్పుడూ బస్సు చివరిభాగంలోని ఓ మూలకు ఉన్న సీట్​లో కూర్చొనేవాడని, ప్రస్తుతం ఆ చోటును అతడి జ్ఞాపకార్థం ఖాళీగా ఉంచామన్నాడు చాహల్.

గతేడాది జరిగిన ప్రపంచకప్​లోని న్యూజిలాండ్​తో సెమీస్​ ఆడిన ధోనీ.. ఆ తర్వాత నుంచి జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇటీవలే బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు నుంచి మహీ పేరు తొలిగించడం వల్ల అతడి రిటైర్మెంట్​పై ఊహాగానాలు వెలువడ్డాయి.

Last Updated : Feb 28, 2020, 6:08 AM IST

ABOUT THE AUTHOR

...view details