తెలంగాణ

telangana

ETV Bharat / sports

'మాకు ప్రతీకారం అక్కర్లేదు.. గౌరవమిస్తే చాలు'

వర్ణ వివక్ష, జాత్యహంకార హత్యల గురించి ఓ ఇన్​స్టా లైవ్​లో మాట్లాడిన క్రికెటర్ బ్రావో.. తమపై ప్రతీకారం అక్కర్లేదని, గౌరవం-సమానత్వం కావాలని కోరాడు.

'మాపై ప్రతీకారం అక్కర్లేదు.. గౌరవమిస్తే చాలు'
డ్వేన్ బ్రావో

By

Published : Jun 10, 2020, 10:27 AM IST

అమెరికాలోని ఫ్లాయిడ్​ ఉదంతం తర్వాత పలువురు నల్లజాతీయులైన క్రీడాకారులు, ప్రముఖులు.. జాత్యహంకారం విషయంలో తమ అనుభవాల్ని బయటపెడుతున్నారు. ఐపీఎల్​లోనూ ఇలాంటిదే తనకెదురైందని క్రికెటర్ సామి ఇటీవలే చెప్పాడు. ఈ నేపథ్యంలోనే మాట్లాడిన వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో.. తమకు ప్రతీకారం అసలే వద్దని సమానత్వం, గౌరవం కావాలని అన్నాడు. జింబాబ్వే మాజీ పేసర్ పొమ్మి మాంగాతో బుధవారం జరిగిన ఇన్​స్టా లైవ్​లో పలు విషయాలను పంచుకున్నాడు.

వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో

"ప్రపంచంలోని పలుచోట్ల ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉంది. ఓ నల్లజాతీయుడిగా, చరిత్రలో మా వాళ్లకు ఏం జరిగిందో చూశాను. మాకు ప్రతీకారం అక్కర్లేదు. సమానత్వం, గౌరవం ఇస్తే చాలు. మేం ఇతరుల్ని గౌరవించినా, మమ్మల్ని ఎందుకు చులకనగా చూస్తున్నారు. నెల్సన్ మండేలా, మహమ్ముద్ అలీ, మైకేల్ జోర్డాన్ లాంటి అద్భుత నాయకులు మాకు మంచి మార్గం వేశారు" -డ్వేన్ బ్రావో, విండీస్ క్రికెటర్

ప్రజలు అందర్ని గౌరవించాలని, ప్రపంచంలో సమానత్వం రావాలని కోరాడు బ్రావో. దీని గురించే మాట్లాడిన వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామి.. వర్ణ వివక్ష, సామాజిక న్యాయం విషయంలో ఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ), వివిధ దేశాల బోర్డులు సహకరించాలని విజ్ఞప్తి చేశాడు.

విండీస్ మాజీ క్రికెటర్ డారెన్ సామి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details