ఇటీవల భారత్‌తో టెస్టు సిరీస్‌లో తమ జట్టు ఓడినప్పటికీ ఓ అమ్మాయి సంతోషంగా ఉందని అన్నాడు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. అదెవరో కాదు అతడి కూతురు ఇండీ రే. తనకు విరాట్ అంటే విపరీతమైన అభిమానం. ఆసీస్ పర్యటనలో కోహ్లీ బహుకరించిన జెర్సీలో ముచ్చటగా చిరునవ్వులు చిందిస్తోంది ఈ చిన్నారి.
విరాట్ జెర్సీలో వార్నర్ కూతురు సందడి - వార్నర్ కూతురు
ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ ఇన్‌స్టాలో ఆసక్తికర ఫొటో పంచుకున్నాడు. అందులో విరాట్ జెర్సీ ధరించి చిరునవ్వులు చిందిస్తున్న అతడి కూతురు అందరినీ ఆకట్టుకుంటుంది.
విరాట్ జెర్సీలో వార్నర్ కూతురు సందడి
"మేము భారత్‌తో ఆడిన సిరీస్ ఓడిపోయాం. అయినా ఓ అమ్మాయి (తన కూతురిని ఉద్దేశిస్తూ) మాత్రం సంతోషంగా ఉంది. జెర్సీ బహుకరించినందుకు విరాట్‌కు ధన్యావాదాలు. అది ఇండీకి ఎంతో నచ్చింది. నేను, ఆరోన్ ఫించ్ కాకుండా తనకి అభిమాన క్రికెటర్ కోహ్లీనే" అంటూ ట్వీట్ చేశాడు వార్నర్.
ఇదీ చూడండి:టెస్టు ర్యాంకింగ్స్: కోహ్లీ@4, పుజారా ర్యాంకు మెరుగు