తెలంగాణ

telangana

ETV Bharat / sports

నాలుగో టెస్టు రద్దా? అదేం లేదే! - నిక్ హాక్లే

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగబోయే నాలుగో టెస్టు వేదికపై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయమై స్పందించారు క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో నిక్ హాక్లే.

We have not received any request from BCCI Says CA CEO Hockley
నాలుగో టెస్టు రద్దా? అదేం లేదే!

By

Published : Jan 4, 2021, 2:51 PM IST

కఠిన క్వారంటైన్‌ ఆంక్షల వల్ల నాలుగో టెస్టు ఆడేందుకు టీమ్ఇండియా నిరాకరించిందన్న వార్తలను క్రికెట్‌ ఆస్ట్రేలియా సీఈవో నిక్ హాక్లే కొట్టిపారేశాడు. క్వీన్స్‌ల్యాండ్‌లో క్వారంటైన్‌ నిబంధనల గురించి భారత క్రికెట్‌ బోర్డుకు పూర్తిగా అవగాహన ఉందన్నాడు. వాటిని పాటించేందుకు పూర్తిగా మద్దతు ప్రకటించిందని పేర్కొన్నాడు.

"ప్రతిరోజూ మేం బీసీసీఐతో మాట్లాడుతున్నాం. వారు మాకెంతో సహాయకారి, మద్దతుగా ఉన్నారు. అభ్యంతరాలకు సంబంధించి అధికారికంగా మాకేమీ అందలేదు. మేం నిర్దేశించిన షెడ్యూలు ప్రకారం ఆడాలని రెండు జట్లు కోరుకుంటున్నాయి" నిక్‌ హాక్లీ వెల్లడించాడు.

క్రికెటేతర వార్తలతో టీమ్‌ఇండియా క్రికెటర్లు వార్తల్లోకెక్కారు. రోహిత్ శర్మ సహా ఐదుగురు క్రికెటర్లు హోటల్‌కు వెళ్లి భోజనం చేయడం, కోహ్లీ, పాండ్యా ఓ దుకాణానికి వెళ్లిన సంగతి తెలియడం కలకలం రేపాయి. వారు మాస్కులు పెట్టుకోలేదని, కొవిడ్‌ నియమావళిని ఉల్లంఘించారని ఆస్ట్రేలియాలోని ఓ వర్గం మీడియా ప్రచారం చేస్తోంది. స్టేడియాల్లోకి అభిమానులను అనుమతించాక మాస్కులు పెట్టుకోవడంలో తర్కం ఏముందని టీమ్ఇండియా వాదనగా తెలుస్తోంది.

ఏదేమైనప్పటికీ నిబంధనల ప్రకారం క్రికెటర్లు ఔట్‌డోర్‌ హోటళ్లలో భోజనం చేయొచ్చు. నగరంలో పర్యటించొచ్చు. అయితే, ఫొటోలు దిగడం, ఇతరుల సమీపంలో నిల్చోవడం ఉల్లంఘన కిందకు వస్తుందో లేదో తెలియాల్సి ఉంది. దీని కోసమే బీసీసీఐ, సీఏ సంయుక్తంగా దర్యాప్తు చేపట్టాయి. సోమవారం నిర్వహించిన కొవిడ్‌ పరీక్షల్లో రెండు జట్ల క్రికెటర్లకు నెగెటివ్‌ రావడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details