భారత్తో జరిగిన మూడో టీ20 ఓటమిపై బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా స్పందించాడు. గెలిచే అవకాశాలు వచ్చినా చేజేతులా మ్యాచ్ను చేజార్చుకున్నామని చెప్పాడు. తనతో సహా సీనియర్ ఆటగాళ్లు సరిగా రాణించలేదని తెలిపాడు.
"ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. మా జట్టులో హిట్టర్లు లేరు. మాకున్న నైపుణ్యాలతోనే మేము ఆడాం. ముఖ్యంగా బ్యాటింగ్లో మరింతగా రాణించాల్సి ఉంది. మా ఆటను ఇంకా మెరుగుపర్చుకోవాల్సి ఉంది. స్థిరంగా రాణించినట్లయితే విజయం మమ్మల్ని వరించేదే -మహ్మదుల్లా, బంగ్లా కెప్టెన్
తనతో సహా సీనియర్ ఆటగాళ్లు సరిగా ఆడలేదని అన్నాడు మహ్మదుల్లా.